హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో టీ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో సభ్యుల బృందం శుక్రవారం డీజీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలుపై డీజీపీతో ఆయన చర్చించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీజీపీకి కోదండరాం విజ్ఞప్తి చేశారు. అలాగే చాలా కాలంగా కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డీజీపీని కోదండరాం కోరారు.