చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం | Home guards stage dharna to press for job regularisation | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 28 2016 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం హోంగార్డులు చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది హోంగార్డులు సచివాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, వాగ్వా దం జరిగాయి. హోంగార్డులను చెదరగొట్టేం దుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై ఆగ్రహించిన హోంగార్డులు సచివాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఓ హోంగార్డు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో దా దాపు 4గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కొందరు హోంగార్డులను అదుపులోకి తీసుకుని, మరోసారి లాఠీ చార్జి చేసి ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement