హోంగార్డులకు రూ.10 వేలు ఇప్పించండి
హోంగార్డులకు రూ.10 వేలు ఇప్పించండి
Published Sun, Sep 3 2017 9:07 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM
♦ హోం మంత్రి, డీజీపీకి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: గణేష్ బందోబస్తులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు టీఏ, డీఏల కింద ఒక్కో హోంగార్డుకు రూ.10వేలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.
భార్య పిల్లలను వదిలేసి, ఆరోగ్యం దెబ్బతింటున్నా కానిస్టేబుళ్లలో సరిసమానంగా బందోబస్తులో నిమగ్నమైన హోంగార్డులకు ప్రత్యేకంగా టీఏ, డీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు డీజీపీ అనురాగ్ శర్మను శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. హోంగార్డు జీవితాల్లో వెలుగునింపేలా మానవతా ధృక్పథంతో టీఏ, డీఏ మంజూరుచేయాలని కోరినట్టు శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement