TRS MLA Srinivas Goud
-
హోంగార్డులకు రూ.10 వేలు ఇప్పించండి
♦ హోం మంత్రి, డీజీపీకి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: గణేష్ బందోబస్తులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు టీఏ, డీఏల కింద ఒక్కో హోంగార్డుకు రూ.10వేలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. భార్య పిల్లలను వదిలేసి, ఆరోగ్యం దెబ్బతింటున్నా కానిస్టేబుళ్లలో సరిసమానంగా బందోబస్తులో నిమగ్నమైన హోంగార్డులకు ప్రత్యేకంగా టీఏ, డీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదివారం హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు డీజీపీ అనురాగ్ శర్మను శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. హోంగార్డు జీవితాల్లో వెలుగునింపేలా మానవతా ధృక్పథంతో టీఏ, డీఏ మంజూరుచేయాలని కోరినట్టు శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కిరికిరి చేస్తే ఊరుకోం
చంద్రబాబుకు శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి సెక్షన్-8ని తెరపైకి తెచ్చారని, ఇలాంటి కిరికిరిలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 10వ షెడ్యూల్లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో ఏపీ అధికారిని నియమించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. 9వ షెడ్యూలోని 85 సంస్థలను విభజించకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విధి విధానాలకు, హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాబు వ్యవహరిస్తూ ఏపీ-తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకోవాలని బాబు చూస్తున్నారని ఆరోపించారు.