సీనియార్టీ ప్రాతిపదికన హోంగార్డులకు పదోన్నతులు కల్పించాలని ఏపీ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.గోవిందు అన్నారు. పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ హాలులో ఏపీ రాష్ట్ర సంక్షేమ సంఘం హోంగార్డుల గుంటూరు రూరల్ జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గోవిందు మాట్లాడుతూ హోంగార్డులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించేందుకు బస్‌పాస్ సౌకర్యం కల్పించాలన్నారు.
వైద్యసేవలు పొందేందుకు నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రధాన సమస్యలన్నింటిపై చర్చించారు. ఈ సమస్యలను పోలీసు డిపార్టుమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి ఐక్యంగా కృషి చేద్దామన్నారు. వెల్ఫేర్ ట్రస్టు, ఆర్టీసీ బస్‌పాస్, నగదు రహిత హెల్త్‌కార్డులు, సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులపై ఏకగ్రీవంగా తీర్మానించారు.