
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత నవనీత్ రాణా ఎన్నికల ప్రచార సభలో ఆమెపై దాడి జరిగింది. ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో నవనీత్ రాణా పాల్గొన్నారు.
ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆమె ఖల్లార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయకుంటే హిందువులంతా తరలివచ్చి నిరసన తెలపాలని ఆమె కోరారు.
ఈ ఘటన అనంతర నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. ఖల్లార్‌లో ప్రచార సభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారు. తాను ప్రసంగం ముగించుకుని, కిందకు వచ్చాక వారు ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారు. తనను దూషించారు. కొందరు తనపై ఉమ్మివేశారని నవనీత్ రాణా తెలిపారు. వెంటనే అప్రమత్తమైన తన అంగరక్షకులు తనను కాపాడి బయటకు తీసుకువచ్చారన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
Comments
Please login to add a commentAdd a comment