
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే పొత్తులపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల గురించి మోదీ వద్ద నడ్డా ప్రస్తావించినట్లు తెలిసింది. నామినేషన్లకు సమయం అసన్నమవ్వడంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నడ్డా ప్రతిపాదించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మోదీ, షా త్వరలోనే అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలుతామన్నట్లు సమాచారం.
ఇక తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. స్థానిక బీజేపీ నేత డా. కోట రామారావును తమ అభ్యర్థిగా బరిలో నిలపుతున్నట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధికారికంగా ఆదివారం ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగునున్న 32 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment