మహారాష్ట్రలో కాంగ్రెస్-3, శివసేన-2 | Maharashtra Legislative council elections: shiv sena, congress win seats in mumbai | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో కాంగ్రెస్-3, శివసేన-2

Published Wed, Dec 30 2015 5:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Maharashtra Legislative council elections: shiv sena, congress win seats in mumbai

ముంబయి : మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. ముంబై, అహ్మద్‌నగర్, ధూలే-నందర్బార్, అకోలా-వాషిమ్ -బుల్ధానా, సోలాపూర్, కొల్హాపూర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. 

 

శివసేన రెండు, బీజేపీ, ఎన్సీపీ చెరోసీటు కైవసం చేసుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. ముంబైలో శివసేన, కాంగ్రెస్ చెరో సీటును గెలుచుకున్నాయి. ధూలే, కొల్హాపూర్‌లలోనూ కాంగ్రెస్ విజయ బావుటా ఎగిరేసింది. కాగా కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు చూపింది.  మొత్తం 25 స్థానాల్లో సగానికి పైగా సీట్లు గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement