నరేంద్ర మోడీ
ముంబై: బీహార్ శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల నుంచి బిజెపి గుణపాఠం నేర్చుకోవాలని మిత్రపక్షం శివసేన హెచ్చరించింది. పనితీరు మెరుగుపరుచుకోవాలని సలహా కూడా ఇచ్చింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి-శివసేన కూటమి ‘మహాయుతి’ కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గాలిపైనే ఆధారపడటం మంచిది కాదని సామ్నా పత్రికలో సంపాదకీయం రాశారు.
‘బీహార్‌లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమికి ఆరు సీట్లు రాగా, బీజేపీకి నాలుగే వచ్చిన వాస్తవాన్ని మనం అంగీకరించాలి. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడా ఉంటుందని ప్రజలు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కేవలం మాటలవల్లే గెలవలేం’ అని వ్యాఖ్యానించింది.