ముంబై : పాకిస్తాన్‌లో భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అతిధుల పట్ల పాక్ వ్యవహరించిన తీరుపై శివసేన స్పందించింది. పాకిస్తాన్ కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తోందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. బాలాకోట్ వైమానిక దాడులతో పాకిస్తాన్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పినా ఇప్పటికీ పాక్ తీరు మారలేదని దుయ్యబట్టారు. పొరుగు దేశం తోకలను కత్తిరించే చర్యలు చేపట్టాలని కోరారు.
మోదీ ప్రభుత్వం తిరుగలేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో థాకరే పేర్కొన్నారు. శాంతి ప్రక్రియ పట్ల ఇమ్రాన్ ఖాన్ చొరవ చూపడం మంచిదే అయినా శనివారం ఇఫ్తార్ విందులో జరిగిన ఘటన శాంతిని నెలకొల్పే దిశగా ఉపకరిస్తుందా అని థాకరే ప్రశ్నించారు. కాగా, ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో బారత హైకమిషన్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి హాజరైన అతిధులను వేదిక వెలుపల భద్రతా అధికారులు నిలిపివేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment