ఖమ్మం: ఉద్యోగం రాలేదని ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని చినమునగాలకు చెందిన విద్యార్థి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఉపాధి అవకాశం దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన అతను ఈ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉద్యోగం రాలేదని బలవన్మరణం
Published Thu, Aug 20 2015 9:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement