సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందివ్వడంతోపాటు, ముద్రా యోజన తదితర పథకాల ద్వారా రుణాలు ఇవ్వాలని డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సీఈవో మాధవ్ పాయ్ సూచించారు. ఈ రంగానికి సంబంధించిన పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సాయపడతాయన్నారు. ‘డబ్ల్యూఆర్‌ఐ ఇండియా కనెక్ట్ కరో’ పేరుతో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘ఎంఎస్‌ఎంఈలు కొద్దికాలంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం. చిన్న వ్యాపారులు మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. ఈ దిశగా ప్రభుత్వ వర్గాలు విభిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలను పెట్‌కోక్ ఆధారితంగా ఎక్కువ కాలం నిర్వహించలేం. పెట్‌కోక్ లేకుండా ఉత్పత్తి పెంచాలంటే కంపెనీలకు అదనంగా పోత్సాహకాలు అవసరం. ప్రపంచంలో 20 అధిక కాలుష్య పట్టణాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన నిబంధనల అనుసరించాలి’ అని మాధవ్ చెప్పారు.
ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం నిజంగానే తగ్గిందా?
‘చాలా ఎంఎస్‌ఎంఈలు రుణాలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నాయి. ముద్రా యోజన తరహా ఇతర పథకాలను ప్రభుత్వం రూపొందించాలి. తద్వారా ఎంఎస్‌ఎంఈల రుణ సమీకరణ సామర్థ్యాన్ని పెంచాలి’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment