గోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త బొగ్గు గని కార్మి కుల 11వ వేతన ఒప్పందం 10వ సమావేశం శుక్రవారం కోల్‌కతాలో జరిగింది. యాజమాన్యం జరిపిన చర్చలో అన్ని అలవెన్స్‌లపై 25శాతం పెంచేందుకు అంగీకారం కుదిరినట్లు జాతీయ కార్మి క సంఘాల నాయకులు తెలిపారు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ 9 నుంచి 11.25 శాతం, స్పెషల్ అలవెన్స్ 4 నుంచి 5 శాతం, హెచ్‌ఆర్‌ఏ 2 నుంచి 2.5, ఎల్‌టీసీ రూ.8వేల నుంచి రూ.10వేలు, ఎల్‌ఎల్‌టీసీ రూ.12 వేల నుంచి రూ.15వేలు పెంచడానికి అంగీకారం కుదిరింది.
సెలవులు, సిక్ లీవ్‌లు 120 నుంచి 150 అక్యుములేషన్ చేసుకోవడానికి, అంబేద్కర్ జయంతిని పెయిడ్ హాలిడేగా అంగీకరించారు. లైవ్ రోస్టర్‌లో ఉన్న అమ్మాయిలకు 18ఏళ్లు వచ్చే వరకు డిపెండెంట్ జాబ్ అవకాశం కల్పించనున్నారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ మస్టర్‌కు రూ.50 చెల్లించనున్నారు. నర్సింగ్ అలవెన్స్ నెలకు రూ.500 ఇవ్వనున్నారు. కార్మి కుడు..కార్మి కుని భార్య చనిపోయి పిల్లలు అనాథలైతే వారికి సగం జీతం, 18ఏళ్లు దాటితే ఉద్యోగం కల్పిస్తారు.
గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 19శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్, 3శాతం ఇంక్రిమెంట్‌తోపాటు ఒప్పుకున్న డిమాండ్లను శనివారం డ్రాఫ్ట్ రూపంలో పొందుపరుస్తారు. సమావేశాన్ని శనివారం కూడా కొనసాగించనున్నారు. సమావేశంలో కోలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు మెంబర్లు ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్‌టీయూసీ నుంచి జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment