స్టార్ హీరోయిన్ సమంత ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్-2, పుష్ప చిత్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వరుణ్ దావన్‌తో నటిస్తున్న సమంత తాజాగా మరో ప్రాజెక్ట్‌కి ఓకే చేసినట్లు తెలుస్తుంది.
అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న నాలుగో హారర్ చిత్రంలో సమంత యువరాణి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట.
Comments
Please login to add a commentAdd a comment