
కాకినాడ కల్చరల్: స్థానిక జీ కన్వెన్షన్ హాలులో శనివారం జరిగిన మిస్ తెలుగు ప్రిన్సెస్ అందాల పోటీలలో విన్నర్‌గా కాకినాడకు చెందిన టీఎన్‌ఎస్ అపర్ణ ఎంపికయ్యారు. ఫస్ట్ రన్నర్‌గా వి.సంజన,(కాకినాడ) సెకండ్ రన్నర్‌గా ఎం.శ్రేష్ట (కాకినాడ) ఎంపికయ్యారు. అందమైన భామలు సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేసి అలరించారు. వయ్యారాలు ఒలకపోస్తూ హంసనడకలతో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను అలరిం చింది.
ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా మిస్ వరల్డ్ అస్ట్రేలియా–2017 ఎస్మా వలోడర్ పాల్గొన్నారు. మహిళలు ఆత్మ«స్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. అందం ఒక్కటే ప్రధానం కాదని సేవాభా వం కూడా పెంపొందించుకోవాలని పోటీలలో పాల్గొన్న యువతులకు సూ చించారు. న్యాయ నిర్ణేతలుగా సుధాజైన్, వైఏ జయలక్ష్మి, ఎం.సరిత, మరియాలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సతీష్ శిఖా, సంస్థ సీఈఓ శిరిష, కోఆర్డినేటర్ నీరజ్, యాంకర్ రాఖీ, అర్జున్, శివ పాల్గొన్నారు.
సేవే నిజమైన అందం
ఈ పోటీలలో విన్నర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం అదిత్య కళాశాలలో బీబీఏ కోర్సు చేస్తున్నాను. మా తల్లిదండ్రులు (టీఎస్‌ఎస్ ప్రసాద్, గీత) ప్రోత్సాహంతో ఈ పోటీలలో పాల్గొన్నాను. మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండాలి. మఖ్యంగా సేవాభావం కలిగిఉండాలి. ఉండాలి. అదే నిజమైన అందంగా భావిస్తాను.
–టీఎన్‌ఎస్ అపర్ణ,
తెలుగు ప్రిన్సెస్ విన్నర్
Comments
Please login to add a commentAdd a comment