మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్‌ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్ దేవ్ వద్ద ఉంటోంది.
(ఇది చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ..)
తాజాగా నవిష్క బర్త్ డే సందర్భంగా శ్రీజ తన ఇన్‌స్టాలో కూతురి ఫోటోను షేర్ చేసింది. నా కూతురు అప్పుడే ఐదేళ్లు పూర్తి చేసుకుందని తెలిపింది. నవిష్క వైట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకుంది. ఇది చూసిన మెగా అభిమానులు హ్యాపీ బర్త్ డే మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. క్రిస్‌మస్ సందర్భంగా సోమవారం నిర్వహించిన వేడుకల్లో శ్రీజ కొణిదెల కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment