
అల్లరి నరేశ్ కొత్త సినిమా 'బచ్చల మల్లి' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానుంది.

'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు మంగదేవి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేశ్,రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా బచ్చల మల్లి సినిమాను నిర్మిస్తున్నారు.




















