'పుష్ప 2'కి పోటీగా రష్మిక నుంచే మరో సినిమా | Rashmika's Pushpa 2 To Compete With Chhava Movie | Sakshi
Sakshi News home page

Rashmika: నేషనల్ క్రష్‌కి పెద్ద చిక్కొచ్చి పడిందే!

Published Mon, Aug 19 2024 12:27 PM | Last Updated on Mon, Aug 19 2024 12:52 PM

Rashmika's Pushpa 2 To Compete With Chhava Movie

రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్‌స్టార్. ఎందుకంటే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. వీటితో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ రీజనల్ మూవీస్ కూడా చేస్తోంది. అయితే ఈమెకు ఇప్పుడు ఊహించని చిక్కొచ్చి పడింది. ఒకేరోజు ఈమె రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుండటమే దీనికి కారణం.

(ఇదీ చదవండి: కూర్గ్‌లో హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి.. డేట్ ఎప్పుడంటే?)

రష్మికకు పాన్ ఇండియా స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా 'పుష్ప'. సీక్వెల్‌తో డిసెంబరు 6న ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. మరోవైపు ఇదే తేదీన 'చావా' అనే బాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ పీరియాడికల్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. డిసెంబరు 6నే థియేట్రికల్ రిలీజ్ అని ప్రకటించారు. విచిత్రం ఏంటంటే ఇందులోనూ రష్మికనే హీరోయిన్.

రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం వల్ల ఎవరికేం ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ పోటీ పక్కా అయితే మాత్రం రష్మికకు పెద్ద కష్టమొచ్చి పడుతుంది. ఎందుకంటే రెండింటికి ప్రమోషన్లు దాదాపు ఒకేసారి జరుగుతాయి. మరి రష్మిక వాటిని ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఇక్కడ ప్రశ్న. అలానే 'పుష్ప 2' లాంటి మంచి బజ్ ఉన్న మూవీకి పోటీగా రావాలని ఫిక్స్ అయ్యారంటే బహుశా మరోసారి 'పుష్ప 2' వాయిదా పడే ఛాన్స్ ఉందని నమ్మకమా? లేదంటే కంటెంట్ మీద 'చావా' దర్శకనిర్మాతలది ధైర్యమా!

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement