
టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. కొన్నాళ్ల క్రితం తన ప్రేమించిన రహస్య గోరఖ్‌తో నిశ్చాతార్థం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఏడడుగులు వేసేందుకు సిద్ధమైపోయారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
ఆగస్టు 22న కర్ణాటకలో కూర్గ్‌లో వీళ్ల పెళ్లి జరగనుంది. రహస్య బంధువులంతా ఆ ఊరిలోనే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకకు హీరో కిరణ్ స్నేహితులు, బంధువులు హాజరవుతారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.
సాప్ట్‌వేర్ ఇంజినీర్స్ అయిన కిరణ్, రహస్య.. షార్ట్ ఫిల్మ్స్‌తో యాక్టింగ్ సైడ్ వచ్చాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్త.. ఆ తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్-రహస్య ప్రేమించుకుంటున్నారు. కాకపోతే ఈ ఏడాది ఆ విషయాన్ని బయటపెట్టారు.
(ఇదీ చదవండి: సూర్య vs రజినీకాంత్.. కలెక్షన్స్ దెబ్బ తీసే పోటీ!)
Comments
Please login to add a commentAdd a comment