సంజయ్‌దత్
‘కళంక్, ప్రస్థానం హిందీ రీమేక్, పానిపట్, షంషేర్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు సంజయ్‌దత్. మరో హిందీ సినిమాకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అద్నాన్ షేక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ బాంబీ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. 1920 కాలంనాటి ముంబైలోని మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ టాక్.
ఇందులో పవర్‌ఫుల్ డాన్ పాత్రలో సంజయ్‌దత్ నటించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో సంజయ్ బ్రదర్‌గా నటుడు బాబీ డియోల్ కనిపిస్తారు. బాబీ పాత్ర కొంచెం సైకోలా ఉంటుందట. ‘‘ఇది ఎవరి లైఫ్ ఆధారంగా తీయబోతున్న సినిమా కాదు. ఫిక్షనల్ స్టోరి. ముంబైలో అండర్‌వరల్డ్ ఉండే నాటి పరిస్థితులను చూపించాలనుకుంటున్నాం. కొన్ని నిజ సంఘటనల రిఫరెన్స్ తీసుకుంటాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment