Shershaah 2021: IMDb Highest Rated Hindi Movie, Details Inside - Sakshi
Sakshi News home page

Shershaah: రికార్డుల ‘షేర్షా’.. ఐఎండీబీ రేటింగ్‌లో నెంబర్‌ 1

Published Fri, Aug 20 2021 8:29 PM

Shershaah Becomes The Highest Rated Hindi Movie On IMDb - Sakshi

సాక్షి, ముంబై: కార్గిల్ వార్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర పోషించిన నటుడు షేర్షా మూవీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. షేర్షాకు లభించిన అపూర్వ స్పందన, నెటిజన్ల ప్రేమకు సిద్ధార్థ్ సోషల్‌ మీడియాద్వారా సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) రేటింగ్‌లో 8.8 తో  టాప్‌లో నించింది. ​'నంబర్ 1 రేటింగ్ హిందీ మూవీ' అంటూ సిద్ధార్థ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. (Shershaah Movie: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్‌.. జయహో అంటున్న ఫ్యాన్స్‌)

అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్ర చేయడం, మూవీ విజయవంతంకావడంతో ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇది తనకు చాలా ప్రత్యేకం, ఎప్పటికీ గుర్తుండిపోయేదని పేర్కొన్నాడు. ఈ సందర్బంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

అటు కియారా అద్వానీ కూడా సినిమా సక్సెస్‌ కావడంపై చాలా ఎమోషనల్‌గా ఉంది. దీనికి సంబంధించి ఒక సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది. సినిమా తాను కెప్టెన్ బాత్రా కుటుంబాన్ని కలిశానని, తాను అచ్చం డింపుల్‌లాగా ఉన్నానని చెప్పడంతో తనకు కన్నీళ్లొచ్చాయని ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది. అలాగే నిజజీవిత డింపుల్‌తో కూడా మాట్లాడాననీ, షేర్షా మూవీలోని పాటలు ఆమెకు బాగా ఆకట్టుకున్నాయని కూడా చెప్పారు. తాజాగా మూవీలో  విక్రమ్‌ బాత్రా అంత్యక్రియల సన్నివేశాన్ని వీక్షిస్తూ కియారా భావోద్వేగానికి గురైన వీడియో వైరల్‌ అయింది. (Shershaah: వెక్కి వెక్కి ఏడ్చిన కియారా అద్వానీ వీడియో వైరల్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement