Sidharth Malhotra And Kiara Advani Planning For Secret Wedding In April 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

Sidharth Malhotra Kiara Advani: రహస్యంగా హీరోయిన్‌తో సిద్దార్థ్‌ వివాహం.. కత్రీనా-విక్కీల తరహాలోనే

Oct 13 2022 12:36 PM | Updated on Oct 13 2022 1:16 PM

Sidharth Malhotra Kiara Advani Plans To Get Secret Wedding In April - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే!..ఈ ఇద్ద‌రూ స‌మ‌యం దొరికితే చాలు ఒక్క‌చోట చేరిపోతారు.అలా వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ పలుమార్లు కెమెరాలకు చిక్కారు. ఇటీవలే కాఫీ విత్‌ కరణ్‌ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే  ఇప్పుడీ లవ్‌ బర్డ్స్‌ పెళ్లిపీటలు ఎక్కనున్నారని బీటౌన్‌ టాక్‌. 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చకచకా పూర్తి చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.  విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌ల తరహాలోనే సీక్రెట్‌ వేడ్డింగ్‌కు ప్లాన్‌ చేసుకుంటున్నారట.

కేవలం బంధువులు, సన్నిహితులు సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారట. అయితే ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సిద్దార్థ్‌.. తాను ఎంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నా ఎలాగైనా అది బయటికొస్తుందంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement