ప్రేమ మజిలీ | Naga Chaitanya And Samantha Majili Movie | Sakshi
Sakshi News home page

ప్రేమ మజిలీ

Published Sun, Dec 23 2018 2:31 AM | Last Updated on Sun, Dec 23 2018 2:31 AM

Naga Chaitanya And Samantha Majili Movie - Sakshi

నాగచైతన్య, సమంత

నాగచైతన్య, సమంతల ప్రేమ మజిలీ ఎందాకా వచ్చిందీ అంటే... ‘అదేంటీ.. పెళ్లి చేసుకున్నారు కదా’ అనే సమాధానం వస్తుంది. అది రియల్‌ లైఫ్‌లో. ఇప్పుడు రీల్‌ లైఫ్‌లో కూడా వీళ్ల ప్రేమ మజిలీ పెళ్లితోనే మొదలవుతుంది. పెళ్లయ్యాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగానే కనిపిస్తారు. ‘నిన్నుకోరి’ చిత్రంతో డీసెంట్‌ హిట్‌ను అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

హరీశ్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే డెహ్రాడూన్, వైజాగ్‌లలోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంది. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్‌తో దాదాపు సగం షూటింగ్‌ పూర్తయింది. సినిమా అంతా లవ్‌ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుంది అంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేసినట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement