విడాకుల అనంతరం సమంత కొత్త సినిమా ప్రకటన | Samantha Signs Her Next Movie With Dream Warrior Pictures After Divorce Announcement | Sakshi
Sakshi News home page

Samantha: విడాకుల అనంతరం సమంత కొత్త సినిమా ప్రకటన.. భిన్నమైన ప్రేమకథగా..

Published Fri, Oct 15 2021 3:37 PM | Last Updated on Fri, Oct 15 2021 5:02 PM

Samantha Signs Her Next Movie With Dream Warrior Pictures After Divorce Announcement - Sakshi

సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారికి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఇక నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం సమంత ఏం చేయనుంది, ఆ తర్వాత తన నిర్ణయం ఏంటని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సామ్‌ బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిందని, అక్కడ వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

చదవండి: పెళ్లి సందD ట్విటర్‌ రివ్యూ

అంతేగాక దసరా పండగ రోజున సమంత ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.  అదేంటా! అని అందరిలో  సెస్పెన్స్‌ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఆమె నెక్ట్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇటీవల శాకుంతం మూవీలో నటించిన సామ్‌ తన తదుపరి చిత్రం డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది.

చదవండి: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ట్విటర్‌ రివ్యూ

కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.ఇందులో సమంత విచారంగా కనిపిస్తుండగా, ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభులు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ మూవీ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఇక ఈ మూవీలోని హీరోతో పాటు మిగిలిన తారాగణాన్ని కూడా త్వరలోనే ప్రకటించి, వీలైనంత త్వరలోనే మూవీ సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు దర్శక-నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.  

చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement