ఔటా? నాటౌటా? | Naga Chaitanya and Samantha Joins With Majili Movie sets | Sakshi
Sakshi News home page

ఔటా? నాటౌటా?

Published Sun, Oct 14 2018 5:36 AM | Last Updated on Sun, Oct 14 2018 5:36 AM

Naga Chaitanya and Samantha Joins With Majili Movie sets - Sakshi

నాగచైతన్య

క్రికెట్‌ గ్రౌండ్‌లోకి దిగారు నాగచైతన్య. కానీ, బ్యాటింగ్‌ చేయలేదు. బౌలింగ్‌ చేయలేదు. ఫీల్డింగ్‌లో బంతి కోసం పరిగెత్తనూ లేదు. కూల్‌గా ఎంపైరింగ్‌ చేశారట. అదేంటీ.. అంటే ప్రస్తుతానికి సస్పెన్స్‌ అన్నమాట. నాగచైతన్య హీరోగా ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివనిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘మజిలీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. క్రికెట్‌ మ్యాచ్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే నాగచైతన్య ఓ క్రికెట్‌ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేశారని సమాచారం. అంపైరింగ్‌ అంటే సినిమా పరంగా నాగచైతన్య క్యారెక్టర్‌కు చాలా ఏజ్‌ ఉండాలి. అలాంటప్పుడు సినిమాలో కచ్చితంగా ఏదో ఒక ఫ్లాష్‌ బ్యాక్‌ ఏపిసోడ్‌ ఉంటుందని ఊహింవచ్చు. ఈ షూట్‌లో నటుడు సుబ్బరాజ్‌ కూడా పాల్గొన్నారు. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement