ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి | A film to make a guts | Sakshi
Sakshi News home page

ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి

Published Sat, Apr 29 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి

ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి

– దర్శకుడు నవీన్‌ మేడారం

‘‘బాబు బాగా బిజీ’ నా తొలి చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటువంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి. ఈ సినిమా చేయడానికి కారణం అభిషేక్‌ నామాగారు. ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా సరదాగా సాగుతుంది’’ అని  దర్శకుడు నవీన్‌ మేడారం అన్నారు. అవసరాల శ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘హంటర్‌’కు రీమేక్‌గా నవీన్‌ దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా నిర్మించిన చిత్రం ‘బాబు బాగా బిజీ’. అవసరాల శ్రీనివాస్, మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి ముఖ్య తారలు. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో హీరోగా అవసరాలని తప్ప మరెవర్నీ ఊహించుకోలేదు. ఆయన కూడా ‘హంటర్‌’ చూడగానే ‘బాబు బాగా బిజీ’ చేయటానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో ఎక్కడా వల్గారిటీ కనపడదు. రియల్‌ లైఫ్‌ను చూస్తున్నట్లు అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎందుకు చేస్తున్నావని చాలా మంది అడిగారు. ఇందులో సైకలాజికల్‌ కంటెంట్, ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌ కావడంతో చేశా’’ అన్నారు అవసరాల. నటుడు తనికెళ్ళ భరణి, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్, శ్రీముఖి, సుప్రియ ఐసాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement