శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన సినిమా 'పిండం'. హారర్ కథతో తీసిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. డిసెంబర్ 15వ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
నా పేరు యశ్వంత్. నాకు యూఎస్ లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఎప్పటినుంచో సినిమా చేయాలని ఉంది. ఓ మంచి కథతో సినిమా చేద్దామని ఇండియాకి వచ్చా. మొదట వేరే కథ చేద్దామనుకున్నాం. అయితే దర్శకుడికి అనుకోకుండా ఈ కథ ఆలోచన వచ్చింది. వారం రోజుల్లోనే కథ పూర్తి చేసి, పిండం అనే టైటిల్ చెప్పారు. మీ అందరి లాగానే మేము కూడా మొదట టైటిల్ విని ఆశ్చర్యపోయాము.
(ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?)
అయితే ఓ జీవి జన్మించాలంటే పిండం నుంచే రావాలి. మరణం తర్వాత పిండమే పెడతారు. జననంలోనూ, మరణంలోనూ ఉంటుంది కాబట్టి పిండం టైటిల్ పెట్టడంలో తప్పేముంది? సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకి కూడా మనం ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుందని దర్శకుడు చెప్పారు. కథ ఓకే అనుకున్నాక పనులన్నీ చకచకా జరిగిపోయాయి. జూన్‌లో షూటింగ్ ప్రారంభమైంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం.
మిగతా హారర్ చిత్రాలతో పోలిస్తే, ఇది భిన్నంగా ఉంటుంది. ఈ తరహాలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి పిండం టైటిలే సరైనది. అలానే షూటింగ్ జరుగుతున్న టైంలో ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఒకరికి కాలు విరిగింది. ఒకసారి సెట్ లోకి పాము వచ్చింది. ఇంకోసారి ఈశ్వరి గారి తలకి గాయమైంది. అలాగే ఒకసారి ఆదివారం అమావాస్య అని తెలియకుండా అర్ధరాత్రి షూటింగ్ ప్లాన్ చేశాం. చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ వచ్చి అమావాస్య అర్ధరాత్రి అని భయపడుతుంటే, దగ్గరలోని గుడి నుంచి కుంకుమ తెప్పించి అందరికీ బొట్లు పెట్టించాము.
(ఇదీ చదవండి: నా భర్త నుంచి దూరం అయ్యాను: బిచ్చగాడు-2 నటి)
Comments
Please login to add a commentAdd a comment