మెరుగైన వినియోగదారు అనుభవంతో లావాదేవీలను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సిస్టమ్‌కు కొన్ని భారీ అప్‌గ్రేడ్‌లను ప్రవేశపెట్టింది. ఈ మార్పులలో లావాదేవీ పరిమితులను పెంచడం, యూపీఐ సర్కిల్ వంటివి ఉన్నాయి.
యూపీఐ123పే పరిమితి పెంపు
ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యూపీఐ123పే (UPI123Pay) లావాదేవీ పరిమితులను అధికార యంత్రాంగం పెంచింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇప్పుడు రూ. 10,000 వరకు నగదు పంపవచ్చు. మునుపటి పరిమితి రూ. 5,000గా ఉండేది. ఈ కొత్త మార్పు ఫీచర్ ఫోన్ వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది.
అయితే ఈ పెరిగిన పరిమితి యూపీఐ123పేకి మాత్రమే వర్తిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ప్రసిద్ధ ఫోన్‌పే (PhonePe), పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay) వంటి యూపీఐ యాప్‌లలో రూ. 1 లక్ష వరకు రోజువారీ లావాదేవీలు చేసుకోవచ్చు. ఇక మెడికల్ ఎమర్జెన్సీ చెల్లింపుల రోజువారీ పరిమితి రూ. 5 లక్షలకు పెరిగింది.
యూపీఐ సర్కిల్
పెరిగిన లావాదేవీ పరిమితులతో పాటు యూపీఐ సర్కిల్‌కు కూడా ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. భాగస్వామ్య చెల్లింపు సర్కిల్‌కు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను జోడించడానికి అనుమతించే యూపీఐ సర్కిల్‌ను ఇప్పుడు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు జోడించవచ్చు. ఇప్పటి వరకు, ఈ ఫీచర్ భీమ్ (BHIM) యాప్ వినియోగదారులకు మాత్రమే ఉండేది. ఈ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారు ఆమోదంతో చెల్లింపులు చేయగలుగుతారు.
గడిచిన ఏడాదిలో (2024) యూపీఐ భారీ వృద్ధిని సాధించింది. ఆర్థిక శాఖ ప్రకారం.. 2024 జనవరి నుండి నవంబర్ వరకు 15,537 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం లావాదేవీ విలువ రూ. 223 లక్షల కోట్లకు చేరుకుంది. కొత్తగా వచ్చిన ఈ మార్పులు ఇప్పుడు మరింత మంది వినియోగదారులను రోజువారీ లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment