చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంతో 20 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.