మహీంద్రా పిక్‌అప్ ట్రక్ ‘ఇంపీరియో’ | Mahindra launches Imperio pick up truck at Rs6.25 lakh | Sakshi
Sakshi News home page

మహీంద్రా పిక్‌అప్ ట్రక్ ‘ఇంపీరియో’

Published Thu, Jan 7 2016 12:46 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

మహీంద్రా పిక్‌అప్ ట్రక్ ‘ఇంపీరియో’ - Sakshi

మహీంద్రా పిక్‌అప్ ట్రక్ ‘ఇంపీరియో’

ప్రారంభ ధర రూ.6.25 లక్షలు
 ముంబై: భారతదేశపు అతిపెద్ద ఎస్‌యూవీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ప్రీమియం పిక్‌అప్ ట్రక్ ‘ఇంపీరియో’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆకట్టుకునే స్పోర్ట్స్ ఎస్‌యూవీ లుక్‌తో పాటు అత్యుత్తమ పనితీరు దీని సొంతమని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. ‘ఇంపీరియో’ ప్రారంభ ధర రూ.6.25 లక్షలు.
 
 అది కూడా థానేలో ఎక్స్ షోరూమ్. ఇంపీరియోలో రాడికల్ టైర్స్, నెక్ట్స్ జనరేషన్ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ కార్గో బాక్స్, 2.5 లీటర్ ఇంజిన్, 1,240 కిలోగ్రాముల పేలోడ్ సామర్థ్యం, లీటర్‌కు 13.55 కిలోమీటర్ల మైలేజ్, కారును పోలి ఉండే ఇంటీరియర్స్, సీట్స్, ఏసీ క్యాబిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇంపీరియో వాహనం సింగిల్ క్యాబిన్, డబుల్ క్యాబిన్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ఈ కొత్త వాహనం ద్వారా పిక్ అప్ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించాలని భావిస్తోంది. ఇంపీరియో వాహన బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement