టోరొంటో:కారు తాళాలు ఇవ్వలేదని కారణంతో ఇండో -కెనడా సంతతికి చెందిన మహిళపై ఓ అగంతకుడు పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. కెనాడాలోని విన్ పిగ్ నగరంలో ఈ ఘటన బుధవారం సంభవించింది. పరమ్ జిత్ కౌర్ (30) అనే మహిళ తన తల్లి, కూతురుతో కలిసి బయటకు వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కారు తాళాలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు బాధితురాలు పేర్కొంది. తాను కారులో కూర్చున్న సమయంలో ఎడమ ప్రక్కగా వచ్చిన అతను తాళాలు కోసం డిమాండ్ చేశాడని, దానికి నిరాకరించడంతో అతను తన వద్ద నున్న కత్తితో పొడిచాడని తెలిపింది.
కాగా, అతను ఎవరు తనకు తెలియదని తెలిపింది. కారు తాళాలు ఇవ్వమని అడగడం, తనను వెంబడించడానికి కారణాలు తెలియదని కౌర్ తెలిపింది. కారు అవతలి విండో దగ్గర తన తల్లి ఉండగా అతను దాడి చేశాడని పేర్కొంది.