లేజర్‌ బిజినెస్‌ కార్డు.. | Laser business card | Sakshi
Sakshi News home page

లేజర్‌ బిజినెస్‌ కార్డు..

Published Sun, Sep 10 2017 1:57 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

లేజర్‌ బిజినెస్‌ కార్డు..

లేజర్‌ బిజినెస్‌ కార్డు..

మీలో చాలా మందికి విజిటింగ్, బిజినెస్‌ కార్డులు ఉంటాయి. అయితే మీ దగ్గరున్న విజిటింగ్‌ కార్డులన్నింటికీ భిన్నంగా ప్రస్తుతం ఈ ఫొటోలో ఉన్నది కూడా ఒక బిజినెస్‌ కార్డేనండి! ఏంటి తెల్ల కాగితం చూపించి బిజినెస్‌ కార్డు అంటున్నారు అనుకుంటున్నారా? అవును ఇది నిజంగానే బిజినెస్‌ కార్డు. అన్ని బిజినెస్‌ కార్డుల్లాగానే ఇందులోనూ వివరాలు ఉన్నాయి. అయితే కనిపించవు. ఆ వివరాలు కనిపించాలంటే మీకు లైట్‌ కావాలి. ఎందుకంటే కాంతి ఉంటేనే ఆ కార్డులోని వివరాలు కనిపిస్తాయి.

ఈ బిజినెస్‌ కార్డులో మొత్తం మూడు లేయర్ల పేపర్లు ఉన్నాయి. మధ్య లేయర్‌ లేజర్‌ కట్‌తో ఉంటుంది. అందువల్ల మీరు లైట్‌ దగ్గరికి దాన్ని తీసుకొస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఇంతకీ ఈ వెరైటీ కార్డు గురించి చెప్పి దాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి చెప్పకపోతే బాగుండదు కదా! ఆ కార్డును తయారు చేసింది కెనడాలోని టొరెంటోలో ఉన్న 26 ఏళ్ల ఆర్ట్‌ డైరెక్టర్‌ డోరి. తనకి కొత్తగా ఆలోచించడం హాబీ. ఆ ఆలోచనలో నుంచే ఈ కార్డు పుట్టుకొచ్చిందని డోరి చెప్పుకొచ్చారు. ఇలాంటి కొత్త రకం కార్డులను తయారుచేయడాన్ని తాను సవాల్‌గా స్వీకరిస్తానని డోరి చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement