Business card
-
నెట్టింట వైరల్‌గా మారిన ఎలాన్ మస్క్.. ‘టెస్లా సీఈఓకి ఇలాంటివి అవసరం లేదు’
స్పెస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఇలా తనకంటూ ప్రత్యకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఎలాన్ మస్క్. ఉక్రెయిన్ రష్యా వార్‌పై కామెంట్ చేసినా, ట్విటర్ డీల్ నుంచి నుంచి వైదొలగినా, అంతెందుకు మస్క్ ట్విట్ కూడా నెట్టింట వైరల్ కావడమే కాదు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ వ్యాపారవేత్త చమత్కారమైన ట్వీట్లతో తన మిలియన్లు ఫాలోవర్లను నవ్విస్తూ ఉంటాడు. తాజాగా మస్క్‌కి సంబంధించిన ఓ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది. 1995లో తన సోదరుడు కింబాల్ మస్క్‌తో కలిసి జిప్2 అనే కంపెనీని ఎలాన్ మస్క్ ప్రారంభించాడు. అప్పట్లో ఓ బిజినెస్ కార్డుని మస్క్ పేరు మీద ప్రింట్ చేశారు. ఆ కార్డు ఫోటోని డాగ్ డిజైనర్ అనే ట్విటర్ ఖాతాదారుడు షేర్ చేయడంతో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ 1999లో మూసేశారు. ఈ పోస్ట్‌కు స్పందించిన ఎలాన్ మస్క్ బదులుగా ‘‘ఏన్షియంట్ టైమ్స్’’(పురాతన కాలాం) అంటు ట్విట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. తాను ఎంచుకున్న సాంకేతిక రంగంలో ఇంత పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా ఈ స్థాయికి చేరుకోవడం పట్ల ఎలాన్ మస్క్‌ని అభినందిస్తున్నారు. టెస్లా సీఈఓ అంటేనే బ్రాండ్ అని, తనకు ఇలాంటి బిజినెస్ కార్డులు అవసరం లేదని మరో నెటిజన్ కామెంట్ చేశారు. Elon Musk's Business Card from 1995 @elonmusk pic.twitter.com/Uix0TMTgiS — DogeDesigner (@cb_doge) July 13, 202 -
ఇల్లు ఊడ్వటానికి రూ. 800, రొట్టెలకు వెయ్యి!
ఈ పోటీ ప్రపంచంలో ఒక్కసారి ఉద్యోగం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం ఎంత కష్టమో మనలో చాలా మందికి అనుభవమే. ఇక నాలుగు ఇళ్లల్లో పనిచేసుకుని జీవనం సాగించే హోం మేడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యజమానుల దయాగుణంపైనే వారి ఆదాయం, ‘ఉద్యోగం’ ఆధారపడి ఉంటుంది. కొంతమంది యజమానులు కఠిన వైఖరి ప్రదర్శిస్తూ అతి తక్కువ జీతానికే వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తుంటారు. అంతేకాదు పొరపాటున జీతం పెంచమని అడిగితే పనిలో నుంచి తీసివేస్తామని బెదిరిస్తారు. దీంతో అప్పటికప్పుడు వేరే చోట పని దొరక్క.. ఉపాధి దొరికే అవకాశం లేక వాళ్లు విలవిల్లాడతారు. అయితే పూణేకు చెందిన ధనశ్రీ షిండే అనే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మాత్రం తన ఇంట్లో పనిచేసే మహిళకు ఇలాంటి పరిస్థితి రానివ్వలేదు. మార్కెటింగ్ రంగంలో తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఆమెకు ఓ బిజినెస్ కార్డు తయారు చేసి.. ఆమెకు చేతినిండా పనిదొరికేలా చేశారు. ఈ విషయాన్ని అస్మితా జవదేవకర్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఉన్న వివరాల ప్రకారం.. ‘ ధనశ్రీ ఓ రోజు ఇంటికి వచ్చే సమయానికి ఆమె పనిమనిషి గీతా కాలే బాధగా కనిపించింది. ఏమైందని ఆరా తీయగా తన ఉద్యోగం పోయిందని చెప్పింది. తద్వారా తాను నెలకు 4000 రూపాయల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందింది. అప్పుడు ధనశ్రీకి ఓ ఆలోచన తట్టింది. ‘ అంట్లు తోమడానికి నెలకు రూ. 800, ఇల్లు ఊడ్వటానికి రూ. 800, బట్టలు ఉతకడానికి రూ. 800, రొట్టెలు చేసేందుకు 1000 రూపాయలు. ఇక ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తరగడం వంటి సేవలు అదనం. ఆధార్ కార్డు కూడా వెరిఫై చేయబడింది’ అంటూ గీతా కాలే పేరిట ఓ బిజినెస్ కార్డు రూపొందించింది. ఇప్పుడు వాళ్లకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. గీతా సేవలను వినియోగించుకునేందుకు బద్వాన్ వాసులు ముందుకు వస్తున్నారు’ అని తన అస్మిత తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. కాగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో గీతా, ధనశ్రీలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యజమాని మనసు గెలుచుకున్న గీతా... పనిమనిషి సమస్యను పరిష్కరించిన ధనశ్రీ.. మీరిద్దరూ సూపర్. అన్నట్లు మీ బిజినెస్ కార్డు కూడా ఎంతో బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
లేజర్ బిజినెస్ కార్డు..
మీలో చాలా మందికి విజిటింగ్, బిజినెస్ కార్డులు ఉంటాయి. అయితే మీ దగ్గరున్న విజిటింగ్ కార్డులన్నింటికీ భిన్నంగా ప్రస్తుతం ఈ ఫొటోలో ఉన్నది కూడా ఒక బిజినెస్ కార్డేనండి! ఏంటి తెల్ల కాగితం చూపించి బిజినెస్ కార్డు అంటున్నారు అనుకుంటున్నారా? అవును ఇది నిజంగానే బిజినెస్ కార్డు. అన్ని బిజినెస్ కార్డుల్లాగానే ఇందులోనూ వివరాలు ఉన్నాయి. అయితే కనిపించవు. ఆ వివరాలు కనిపించాలంటే మీకు లైట్ కావాలి. ఎందుకంటే కాంతి ఉంటేనే ఆ కార్డులోని వివరాలు కనిపిస్తాయి. ఈ బిజినెస్ కార్డులో మొత్తం మూడు లేయర్ల పేపర్లు ఉన్నాయి. మధ్య లేయర్ లేజర్ కట్‌తో ఉంటుంది. అందువల్ల మీరు లైట్ దగ్గరికి దాన్ని తీసుకొస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఇంతకీ ఈ వెరైటీ కార్డు గురించి చెప్పి దాన్ని తయారు చేసిన వ్యక్తి గురించి చెప్పకపోతే బాగుండదు కదా! ఆ కార్డును తయారు చేసింది కెనడాలోని టొరెంటోలో ఉన్న 26 ఏళ్ల ఆర్ట్ డైరెక్టర్ డోరి. తనకి కొత్తగా ఆలోచించడం హాబీ. ఆ ఆలోచనలో నుంచే ఈ కార్డు పుట్టుకొచ్చిందని డోరి చెప్పుకొచ్చారు. ఇలాంటి కొత్త రకం కార్డులను తయారుచేయడాన్ని తాను సవాల్‌గా స్వీకరిస్తానని డోరి చెప్పారు.