అమ్మకానికి హోటల్.. ఒక్కో గది రూ. 5 కోట్లు! | Saudi Prince Said Seeking Sale Of Four Seasons Toronto | Sakshi
Sakshi News home page

అమ్మకానికి హోటల్.. ఒక్కో గది రూ. 5 కోట్లు!

Published Wed, Jun 8 2016 7:16 PM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

అమ్మకానికి హోటల్.. ఒక్కో గది రూ. 5 కోట్లు! - Sakshi

అమ్మకానికి హోటల్.. ఒక్కో గది రూ. 5 కోట్లు!

సౌదీ అరేబియా రాకుమారుడు అల్వలీద్ బిన్ తలాల్-అల్-సౌద్ టోరంటోలోని ఫోర్ సీజన్స్ హోటల్‌ను అమ్మకానికి పెట్టారు. ప్రిన్స్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ కింగ్ డమ్ హోల్డింగ్ కార్పొరేషన్ హోటల్ ను ఈ ఏడాది మార్కెట్లో అమ్మకానికి పెట్టనున్నట్లు సమాచారం. ఇంతకీ హోటల్ రేటెంతో తెలుసా.. అందులోని ఒక్కో గది రూ. 5.42 కోట్ల వరకు ధరను నిర్ణయించారట.

దీనిపై కింగ్ డమ్ హోల్డింగ్ ప్రతినిధిని ప్రశ్నించగా.. ఫోర్ సీజన్స్ హోటల్లో ఎప్పటిలానే అతిథులను తాము ఆహ్వానిస్తామని అన్నారు. 2007లో ఈ హోటల్‌ను కింగ్ డమ్ హోల్డింగ్స్ 3.8 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. యార్క్ విల్లీలో ఉన్న ఫోర్ సీజన్స్ హోటల్ రెండు భారీ భవనాలల సముదాయం. ఇందులో ప్రత్యేకంగా హోటల్, లగ్జరీ రూమ్ లను 2012లో ప్రారంభించారు. హోటల్ లో మొత్తం 250 గదులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement