Parrikar
-
గోవా సీఎం పారికర్ అనారోగ్యంపై బీజేపీలో ఆందోళన
-
నేడు పరీకర్ బలనిరూపణ
-
నేడు పరీకర్ బలనిరూపణ
పణజీ: స్వతంత్ర సభ్యుల మద్దతుతో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోనుంది. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చినా.. రెండ్రోజుల్లోనే విశ్వాస పరీక్ష ఉండాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం పరీకర్ సర్కారు బలపరీక్షకు సిద్ధమైంది. 40 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో బీజేపీకి 13 మంది సభ్యులుండగా.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కమలదళం బలం 21కి (మేజిక్ ఫిగర్) చేరింది. మరో స్వతంత్ర అభ్యర్థి కూడా ఈ కూట మికే ఓటేయటంతో పరీకర్‌కు మద్దతిచ్చేవారి సం ఖ్య 22కు పెరిగింది. దీంతో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది. ‘మా ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. అందులో సందేహం లేదు’ అని పరీకర్ చెప్పారు. కాగా, గోవాలో ప్రభుత్వం ఏర్పా టు ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసిందని ఎన్డీయే భాగస్వామి శివసేన విమర్శించింది. -
దమ్ముంటే షూట్ చేయండి.. అయితే...!
పణాజి: రక్షణ శాఖ మంత్రి మనోహరి పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిక బుల్లెట్ ప్రూఫ్ కారును వదిలేసా.. దమ్ముంటే కాల్చు కోండి అంటూ తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. గోవాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన తాను బుల్లెట్ ప్రూఫ్ కాని మామూలు కారులో ప్రయాణిస్తున్నానని, తనను ఎవరైనా షూట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. తన అధికారిక బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చిన పారికర్ ఇక దానికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాన్నారు. అందుకే మామూలు వైట్ కారు (బుల్లెట్ ప్రూఫ్ కాని)అడిగానన్నారు. ఎవరైనా తను కాల్చి చంపాలనుకుంటే...షూట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. అయితే కాల్చిన వాళ్లను ప్రాణాలతో ఢిల్లీకి చేరనివ్వమంటూ పారికర్ హెచ్చరించారు -
‘తేజస్ కూడా రఫెల్ అంత స్ట్రాంగే’
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ కూడా త్వరలో ఫ్రాన్స్ దేశ నుంచి రాబోతున్న రఫెల్ యుద్ధ విమానాలంత పటిష్టమైనవని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ప్రపంచంలోనే ఈ తరహా యుద్ధ విమానాలు మేలైనవని, సాటిలేనివని చెప్పారు. తేజస్ యుద్ధ విమానాలను ఈ ఏడాది ప్రారంభంలో భారత సైన్యానికి అప్పగించిన విషయం తెలిసిందే. ‘ఈ విమానాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రపంచంలోని ఏ యుద్ధ విమానంతోనైనా పోటిపడే సత్తా ఉండేలా దీన్ని తయారు చేశారు. రఫెల్ యుద్ధ విమానమంతటి శక్తిమంతమైనది. అయితే, ఈ విమానం అత్యంత తేలికపాటి యుద్ధ విమానం’ అని పారికర్ అన్నారు. అయితే, రఫెల్ యుద్ధ విమానాలు తొమ్మిది టన్నుల పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలిగితే తేజస్ మాత్రం మూడున్నర టన్నులు మోసుకెళుతుందని, 33 ఏళ్లపాటు తేజస్ సేవలు అందిస్తుందని తెలిపారు. -
ఆరెస్సెస్ బోధనల వల్లే ‘సర్జికల్’
పరీకర్ వ్యాఖ్య అహ్మదాబాద్: పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేయాలనే ఆలోచన బహుశా తమకు ఆరెస్సెస్ బోధనల వల్లే వచ్చి ఉండొచ్చని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ సోమవారం అన్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని మోదీ, సైనిక బలగాల చరిత్రలేని గోవా నుంచి వచ్చిన తాను కలసి ఈ దాడులకు ఆదేశాలివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అహ్మదాబాద్‌లోని నిర్మా వర్సిటీ నిర్వహించిన ‘నో మై ఆర్మీ’(నా సైన్యం గురించి తెలుసుకో) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కొంతమంది ఈ దాడులకు సాక్ష్యాలు అడుగుతున్నారు. ఆర్మీ చెబితే నమ్మాలి. సాక్ష్యాలు ఇచ్చాకా నమ్మని వారు కొందరుంటారు. రుజువులు కోరే వారిని పట్టించుకోనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం మనకుంది’ అని అన్నారు. ఐదారేళ్లలో సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ చాలామార్లు ఉల్లంఘించిందని, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ప్రస్తుతం మనం వారికి తగిన విధంగా (కాల్పులు, దాడులతో) సమాధానమిస్తున్నామన్నారు. -
మోదీ ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోయారు!
న్యూఢిల్లీ: 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. దాదాపు 94నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ ప్రసంగాన్ని చాలామంది ఆహూతులు శ్రద్ధగా విన్నారు, కానీ నేతలు మాత్రం పార్టీలకతీతంగా ధ్యానముద్రలోకి దిగారు. ప్రసంగాన్ని ఈ చెవి నుంచి ఆ చెవికి వదిలేసి తాపీగా నిద్రలోకి జారుకున్నారు. మోదీ మాట్లాడుతున్నంతసేపు నిద్రమత్తులో జోగారు. ఒక్కరేమిటి.. ఇలా కునుకుపాట్లు పడుతూ కేంద్ర మంత్రులు, ఇతర నేతలు కెమెరాకు చిక్కారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, అనంత కుమార్, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కళ్లుమూసి నిద్రమత్తులో ఉన్నట్టు కనిపించిన వారి దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించి.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, వ్యూహాలు, పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇలా పలు అంశాలపై ఈసారి ప్రధాని ప్రసంగం సుదీర్ఘంగా సాగి మరో రికార్డు సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విపాసన ధ్యానాన్ని పది రోజులు ప్రత్యేకంగా సాధన చేసి వచ్చారు. ఆ ప్రభావంతో కేజ్రీవాల్ ధ్యానముద్రలో మునిగిపోగా.. ఆయనను చూసి బీజేపీ నేతలు కాస్తా ధ్యానాన్ని నేర్చుకొని ఉంటారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. -
మోదీ, పారికర్‌తో గవర్నర్ సమావేశం
న్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా ఉన్నారు. ఆయన గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులపై నివేదిక సమర్పించారు. అలాగే రాష్ట్రాల్లోని తాజా పరిణామాలపై మోదీతో చర్చించారు. వీరి భేటీ సమారు గంటపాటు కొనసాగింది. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలను ముమ్మరం చేశాయన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించారు. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రక్షణమంత్రి పారికర్‌తో నరసింహన్ సమావేశమయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ల మూసివేత వివాదంపై ఆయనతో చర్చించారు. కంటోన్మెంట్ ఏఓసి సెంటర్ రహదారి వివాదంపై ఆర్మీ అధికారులతో రక్షణశాఖ చర్చించనుంది. కంటోన్మెంట్ ఏఓసి సెంటర్ రహదారిలో సామాన్య ప్రజానీకం చేయకుండా ఆర్మీ అధికారులు గతంలో నిషేధాజ్ఞలు విధిస్తామంటూ గతంలో బహిరంగ ప్రకటన చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖలు కూడా రాసింది. అప్పట్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా ప్రజాసౌకర్యార్ధం ఈ రహదారిని మూసివేయవద్దని కేంద్ర రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో 2016 మే 31వ తేదీ వరకు ఆంక్షల్ని సడలిస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలోపు రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించాలని సూచించింది. గడువు దగ్గర పడటంతో ఆ అంశాన్ని గవర్నర్ ఈ సందర్భంగా రక్షణమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. -
రఫల్ విమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం
న్యూఢిల్లీ: రఫల్ యుద్ధ విమానాలను రెండేళ్లలో భారత వైమానిక దళంలో ప్రవేశపెడతామని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం గొప్ప నిర్ణయమన్నారు. గత 17 ఏళ్లుగా కొలిక్కిరాని అంశంపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు. భారత వాయుసేన అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కార్యక్షేత్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్న 36 రఫల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 126 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడేళ్లుగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో అధిక ధరపై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ వివాదానికి తెరపడింది. -
సమర్థ నేతలు కావలెను!!
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పరిపాలనపైనే దృష్టి పెట్టిన నరేంద్ర మోదీకి, ప్రధాని అయ్యాక కేంద్రంలో ప్రాధాన్యతలు మారాయి. శాసనాలు, విధానాల రూపకల్పన ఇప్పుడాయన ప్రధాన విధి. దానికి అత్యంత నమ్మకస్తులు, తెలివైన వారు అవసరం. గోవా ముఖ్యమంత్రి పారికర్ వీరిలో ఒకరు. ఆరు నెలల క్రితం భారత కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు ముఖ్యమైన మంత్రి పదవులను ఒకే వ్యక్తికి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండింటినీ తనవద్దే అట్టిపెట్టుకు న్నారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తున్న నాలుగు మంత్రిత్వ శాఖల్లో ఇవి రెండు. (మరో రెండు శాఖలు హోం, విదేశీ వ్యవహా రాలు). పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు జైట్లీ మాట్లాడుతూ కొద్ది వారాల వరకు అంటే మరొకరు దాన్ని స్వీకరించేంతవరకు మాత్రమే రక్షణ శాఖను తన వద్ద ఉంచుకుంటానని చెప్పారు. ఆ మరొకరు మరెవరో కాదు మాజీ జర్నలిస్టు అరుణ్ శౌరీనే అని ఆ సమయంలో ఒక అంచనా ఉండేది. ప్రధానమంత్రి మనస్సులో ఎవరు ఉండేవారో కానీ, ఆ వ్యక్తి ఉనికి బయటకు రాలేదు. ఈ లోగా మే నెల దాటి నవంబర్ కూడా వచ్చేసింది. ఈ కారణం వల్లే భారతీయ జనతా పార్టీలో చక్కటి ఆలోచనాపరుడిగా కనిపిస్తున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోనికి తీసుకు వస్తు న్నారని పత్రికా వార్తలు సూచిస్తున్నాయి. అత్యంత సమర్థత కనబరుస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని వదులు కుని ఢిల్లీకి ఎందుకు రావలసివస్తోందన్నది ప్రశ్న. ప్రత్యేకించి, ప్రధాని మోదీ ఎంపిక చేసుకోవడానికి 300 మందికి పైగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అందుబాటులో ఉండగా, ఢిల్లీకి బయట ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు? ప్రతిభా లేమికి సంబంధించిన ఈ సమస్య ముందుకు రావడానికి రెండు కారణాలు ఉంటున్నాయి. మొదటి సమస్య సాధారణమైంది. ప్రత్యేకించి, వాస్తవమైన లేదా తాము కనుగొన్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆగ్రహావేశాలను ప్రదర్శించడాన్ని ప్రాతిపదికగా కలిగి ఉన్న హిందుత్వ వంటి బలమైన భావజాలం ఒక రకం వ్యక్తులను సులభంగా ఆకర్షిస్తుంది. గురూజీ గోల్వాల్కర్, వీరసావర్కార్, దీనదయాళ్ ఉపాధ్యాయ్ వంటి వ్యక్తుల రచనలవైపు ఆకర్షితులయ్యే ఇలాంటి వ్యక్తులు వారి ఆలోచనల్లో మాత్రం సూక్ష్మతను, చురుకుదనాన్ని కలిగి ఉంటారని మనం భావించకూడదు. అందుకే ప్రస్తుతం దాదాపు 280 ఎంపీ స్థానాలున్న బీజేపీ కంటే, గతంలో 200 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే సమర్థమైన, చురుకైన నాయకులు ఎక్కువగా ఉండే వారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకోవడానికి ముగ్గురు అగ్ర శ్రేణి ఆర్థికమంత్రులు (మన్మోహన్ సింగ్‌తోపాటు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ) అందుబాటులో ఉండేవారు. కానీ నరేంద్ర మోదీకి మాత్రం రక్షణ శాఖకు కూడా సమయాన్ని వెచ్చించగలి గిన ఒకే ఆర్థిక మంత్రిని మాత్రమే ఉపయోగించుకోవల్సి వస్తోంది.తమ ఆలోచనల్లో నమ్రతను, కార్యదక్షతను ప్రదర్శించే బీజేపీ నేతలు (జైట్లీ, పారికర్) ఉన్నారు కానీ వీరు హిందుత్వ అంశాలపై తక్కువ సైద్ధాంతికతను కలిగి ఉండటమే కాకుండా, కాస్త సరళంగానూ ఉంటున్నారు. రెండో సమస్య మరింత నిర్దిష్టమైనది. ఇది ప్రధాని అభద్రతకు సంబంధించిన విషయం. కేంద్ర మంత్రిమండలిలో కొంతమంది ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు ఉన్నారు కానీ వారిని ఆయన ఉపయోగించదల్చుకోలేదు. దీనికి కారణం ఏమంటే వారు మరీ వృద్ధులైపోయారు (ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ ఇద్దరూ లోక్‌సభలో ఉన్నారు వారికి పనిలేదు) లేదా వారు మరీ చిన్నవారుగా ఉన్నారు (వరుణ్ గాంధీ, అత్యాశపరుడు, చురుకైనవాడు, మరిన్ని బాధ్యతల కోసం ఎదురుచూస్తుంటారు). వీరిని పక్కన ఉంచడానికి అసలు కారణం ఏమంటే, వీరు మోదీని గదమాయించగలరు. మంత్రిమండలిలోకి వీరిని తీసుకుంటే మోదీ వారితో వ్యవహరించలేరు. గుజరాత్లో కూడా మోదీ ఇలాగే చేశారు. కేశుభాయ్ పటేల్, కాశీరామ్ రాణా వంటి అనుభవజ్ఞులైన నేతలను వారి మద్దతుదారులను కూడా మోదీ అధికార పదవులకు దూరంగా ఉంచారు. అయితే గుజరాత్లో తను చేసి చూపగలిగినదాన్ని ఢిల్లీలో కూడా ప్రతికల్పన చేయాలంటే ఒక అడ్డంకి ఉంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే, గుజరాత్‌ను నడపడంలో మోదీ దృష్టి ప్రధానంగా పరిపాలనపైనే ఉండేది. స్పష్టంగా చెప్పాలంటే చాలావరకు కేంద్రం నుంచి వచ్చే విధానాలను అమలు చేయడమే. వాజ్‌పేయీ ప్రభుత్వం విద్యుత్ రంగం విషయంలో ప్రైవేట్ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు దాన్ని గుజరాత్లో మోదీ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులు అధికంగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి నుండి వచ్చేది. కేంద్ర విధానాలను గుజరాత్లో అమలు చేయడానికి మోదీ ఉన్నతాధికారుల బృందాన్ని నియమించారు. వీరు మంత్రుల విధులతో వ్యవహరించేవారు. రాజకీయ నేతల జోక్యాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం పనిపై కేవలం ఇద్దరు మంత్రులకు మాత్రమే వాస్తవంగా బాధ్యత ఉండేది (సౌరభ్ పటేల్, అమిత్ షా). వీరిలో ఏ ఒక్కరికీ కేబినెట్ స్థాయి ఉండేది కాదు. అలా వారు తమ పనిని బ్యూరోక్రాట్ల ద్వారా మోదీ నేరుగా పర్యవేక్షిస్తున్నారన్న అవగాహనతో ఉండేవారు. ఢిల్లీకి తరలి వెళ్లాక, పని స్వభావం మారింది. మోదీ ఇప్పు డు శాసనాల రూపకల్పన, విధానాలపైనే దృష్టిని కేంద్రీకరిం చాల్సి ఉంది కాని వాటి అమలు పట్ల కాదు. ఇది ఆయన పని పద్ధతికి అంతరాయం కలిగించింది. గుజరాత్లో మాదిరే తాను నమ్ముతున్న పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్ వంటి మంత్రులకు ఎక్కువ పని అప్పగించడం ద్వారా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోవాలని మోదీ ప్రయత్నించారు. వీరి ద్దరూ మోదీకి ప్రీతిపాత్రమైన ఇంధనం, వాణిజ్యం, పరి శ్రమలు వంటి పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రధాన విధి ఏదంటే శాసన, విధాన రూపకల్పనే. దీన్ని నిర్వహించడం కోసం మోదీకి అత్యంత తెలివైన వ్యక్తులు అవసరం. కానీ అలాంటి వారు ఆయనకు అందుబాటులో లేరు. అయితే వారి దురదృష్టమో లేక ప్రభుత్వ దురదృష్టమో కానీ, మోదీ కోరుకోని వ్యక్తులే కేంద్ర మంత్రిమండలిలో ఉన్నారు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఆకార్ పటేల్