రఫల్ విమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం | Rafale fighter jets to be inducted into IAF in span of two years: Manohar Parrikar | Sakshi
Sakshi News home page

రఫల్ విమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం

Published Sat, Apr 11 2015 1:09 PM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

రఫల్ విమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం - Sakshi

రఫల్ విమానాల కొనుగోలు గొప్ప నిర్ణయం

న్యూఢిల్లీ: రఫల్ యుద్ధ విమానాలను రెండేళ్లలో భారత వైమానిక దళంలో ప్రవేశపెడతామని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం గొప్ప నిర్ణయమన్నారు. గత 17 ఏళ్లుగా కొలిక్కిరాని అంశంపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారన్నారు.

భారత వాయుసేన అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కార్యక్షేత్రంలో దూకడానికి సిద్ధంగా ఉన్న 36 రఫల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా 126 రఫల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మూడేళ్లుగా భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరుగుతున్న చర్చల్లో అధిక ధరపై ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ వివాదానికి తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement