
ప్రతీకాత్మక చిత్రం
ఇంటర్నెట్ ఎక్కువగా వాడితే మనిషి సంతోషంగా ఉంటాడంటూ ఒక సర్వే తెలిపింది. అయితే అది వాడే విధానంపై ఆధారపడి ఉంటుందనీ, ఎంతసేపు ఇంటర్నెట్ బ్రౌజ్ చేశామన్నది కాదు, దేని గురించి సెర్చ్ చేశాం అన్నది ముఖ్యమంటున్నారు పరిశోధకులు. నెట్‌ను ఎక్కువగా వాడేవారు చాలా సంతోషంగా ఉంటున్నారనీ యూరప్‌లో దాదాపు లక్ష మందిపై సర్వే చేశామని వారు పేర్కొన్నారు.
మనిషి ఎప్పుడూ ఆశావాదే. సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. జీవితంలో సంతోషమనేది యూ(U) ఆకారంలో ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక వయసు వరకు సంతోషంగా ఉంటారనీ, వయసు పెరిగే కొద్దీ సంతోషంగా ఉండలేరనీ, మళ్లీ వృద్దాప్యంలో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో తేలింది. ఆన్‌లైన్లో ఉండడం వల్ల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయని, వారి స్నేహితులు, బంధువులతో నిత్యం టచ్‌లో ఉండటంతో వారు హ్యాపీగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
యూరప్‌లోని లక్షమందిపై చేసిన ఈ సర్వేలో వీరి వ్యక్తిగత వివరాలను పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం ఆన్‌లైన్‌లో ఉండే సమయం, వయసులను మాత్రమే తీసుకున్నామని నార్వేలోని కల్చరల్ యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో పరిశోధకులు వెల్లడించారు. యవ్వన వయస్కుల్లో ఈ తేడా కనిపించలేదట. మధ్య వయస్కుల్లోనే ఇంటర్నెట్ ఎక్కువగా వాడేవారు ఆనందంగా ఉన్నారు.
ఏం చేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు?
బాధను దరిచేరనీయకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, సమయపాలన, పాజిటివ్ థింకింగ్ చేయడం. నీతో నువ్వు స్నేహితుడిగా ఉండటం. మద్యపానానికి దూరంగా ఉండటం. మంచి డైట్‌ను పాటించటం. సమయానికి నిద్ర పోవడం. కష్ట సమయాల్లో తమ విషయాలను స్నేహితులు, ఆత్మీయులతో పంచుకుంటే చాలా ఉపశమనం ఉంటుంది.
ఇంటర్నెట్ వాడకం వల్ల మధ్య వయస్కుల్లో సంతోషంగా ఉండేవారి సంఖ్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీకి చెందిన మరో శాస్త్రవేత్త పైన చెప్పిన విషయాలతో ఏకీభవించలేదు. ఇంటర్నెట్ వాడకం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. మంచి, చెడు విషయాలకు వాడుకోవచ్చని ఇలా అన్నింటిని కలిపి ఇంటర్నెట్ అనే గొడుగు కిందకు చేర్చి కేవలం మంచి మాత్రమే జరుగుతుందని చెప్పలేమని పరిశోధకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment