
బాదం నూనె, ఆముదం రెండూకొద్ది కొద్దిగా తీసుకుని మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు పెదవులపై రాసుకోవాలి. దీని వల్ల పెదవులు మృదువుగా తయారవుతాయి.కంటి చుట్టూ నల్లని వలయాలు ఉండి చర్మం ఉబ్బెత్తుగా అవుతుంటే... కొంచెం కొబ్బరినూనె, కొంచెం ఆముదం తీసుకుని రెండింటినీ కలిపి కంటి చుట్టూ వేళ్ళ సహాయంతో వృత్తాకారంలో తిప్పుతూ నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ చర్మంలో ఇంకేంత వరకూ ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.తేనెలో కొంచెం పెరుగు కలిపి తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న కేశాల చివర్లకు పట్టించాలి.
5 నిమిషాలపాటు ఉంచుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కురులు చాలా మృదువుగా అవుతాయి. ఈ సహజ సిద్ధమైన కండిషనర్‌ను స్కాల్ప్‌కు తగలనివ్వకుండా కురులకు మాత్రమే రాయాలి.అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి చేతులకి, కాళ్లకి మసాజ్‌చేస్తే మృదువవుతాయి.∙ఆరు టీ స్పూన్‌ల పెట్రోలియమ్‌జెల్లీలో రెండు టీ స్పూన్‌ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్‌ల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు కాళ్ళకి, చేతులకి మాయిశ్చరైజర్‌లా ఉపయోగిస్తే మంచిఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment