మృదువైన పెదవుల కోసం... | For soft lips | Sakshi
Sakshi News home page

మృదువైన పెదవుల కోసం...

Published Fri, Feb 6 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

మృదువైన పెదవుల కోసం...

మృదువైన పెదవుల కోసం...

 అందమె ఆనందం

వాతావరణం, అనారోగ్యం వల్ల పెదవులు పొడిబారి, మృదుత్వాన్ని కోల్పోతాయి. లిప్‌బామ్స్ ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఇవ్వగలవు. లిప్‌బామ్స్ సహజసిద్ధమైన తేనె, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్.. వంటివి కలిపి ఇంట్లోనే తయారుచేసి, వాడుకోవచ్చు.గాజు గిన్నెలో టేబుల్‌స్పూన్ పెట్రోలియమ్ జెల్లీ వేసి అవెన్‌లో 30 సెకన్లు వేడి చేయాలి. లేదంటే వేడినీటిలో గాజు గిన్నెను ఉంచి పెట్రోలియమ్ జెల్లీని కరిగించాలి. దీంట్లో టీస్పూన్ తేనె కలపాలి. బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. తర్వాత అదే డబ్బాను ఫ్రీజర్‌లో ఒక రోజంతా ఉంచి, తర్వాత లిప్‌బామ్‌గా వాడుకోవచ్చు.

పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని, వేడిచేయాలి. దీంట్లో మరో చిన్న గిన్నె అమర్చి టేబుల్ స్పూన్ మైనం, కొబ్బరి నూనె వేసి కలపాలి. మైనం పూర్తిగా కరిగాక దాంట్లో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. మిశ్రమం వేడెక్కాక గిన్నె తీసి, దాంట్లో టీ స్పూన్ తేనె, 8 చుక్కల నిమ్మనూనె కలపాలి. బాగా చిక్కగా ఉన్న ఈ మిశ్రమం చిన్న డబ్బాలోకి తీసుకుని, పూర్తిగా చల్లారాక పెదవులకు రాసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement