పెదవుల మృదుత్వానికి... | Lips dehydration and tips | Sakshi
Sakshi News home page

పెదవుల మృదుత్వానికి...

Published Wed, Aug 30 2017 12:53 AM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

పెదవుల మృదుత్వానికి...

పెదవుల మృదుత్వానికి...

కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,. పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి. ఇందుకు దారితీసే కారణాలు...

కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి.
వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమ కోల్పోయి పొడిబారతాయి.
పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే.
లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్‌ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి.
♦  ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితే కూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదే మొదటిది.

పెదవులకు సాంత్వన చేకూరాలంటే...
 ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసాన్ని, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. దానంతట అది ఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండుసార్లు, సాయంత్రం రెండుసార్లు  కాని పట్టించవచ్చు.

ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడినీటిలో దూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటిని పట్టించాలి. వీలైతే నీటిలోనే వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు.
లిప్‌స్టిక్‌ కొనేటప్పుడు అందులో వాడిన పదార్థాల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్‌ కంపెనీలు తప్పనిసరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్‌ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్‌ ప్రాపర్టీస్‌ కూడా ఉంటాయి. ఒకసారి నిర్ధారణ చేసుకోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement