
చెరువులో లభించిన సకర్ మౌత్ క్యాట్‌ఫిష్
కర్ణాటక: బెంగళూరు గ్రామీణ జిల్లా ఆనేకల్ తాలూకా మాయసంద్ర గ్రామంలో చెరువులో అరుదైన చేపలు లభించాయి. శనివారం సాయంత్రం చెరువులో వేసిన వల వేసి తీయగా నల్లగా, చారలు, చుక్కలతో భయం గొలిపేలా ఉన్న రాకాసి చేపలు లభించాయి. వీటి దేహం రాయిలాగ గట్టిగా ఉంది, పదునైన రెక్కలు కలిగి ఉన్నాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కో చేప సుమారు 2 కేజీల పైనే బరువుంది. ఈ చేపలను హైపోస్టోమస్, ప్లెకోస్టోమస్ లేదా సకర్ మౌత్ క్యాట్ ఫిష్, కామన్ ఫ్లెకో అని, అచ్చ తెలుగులో దయ్యం చేప అని పిలుస్తారు.
వీటితో అన్నీ సమస్యలే
సాధారణంగా ఈ చేపలు తినడానికి పనికిరావు. ఈ చేపలను అక్వేరియంలలో అలంకారం కోసం ఉంచుతారు. ఇవి ఊరి చెరువులోకి ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. ఇటువంటి చేపలు విస్తరిస్తే పనికి వచ్చే ఇతర చేపల సంతతి నాశనమవుతుందని, ఆదిలోనే అరికట్టాలని జాలర్లు తెలిపారు. ఇవి మంచి చేపల గుడ్లను తినేసి ఆ జాతులను దెబ్బతీస్తాయి, దీని వల్ల కేంద్ర ప్రభుత్వం దయ్యం చేపల పెంపకాన్ని నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment