సాక్షి, తూర్పుగోదావరి: ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మనిషి ముఖంతో పోలిన రూపంతో ఉన్న అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సోషల్ మీడియాలో ఈ చేప వైరల్‌గా మారింది. విచిత్రం ఏమిటంటే.. తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్‌లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు.
ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్‌లా (ఉబ్బుతుంది)మారిపోతుంది. అందుకే బెలూన్ ఫిష్ అంటారు. చేప అలా ఉబ్బిపోగానే.. దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి.
టెట్రాడాంటిడీ జాతికి చెందిన ఈ చేప శాస్త్రీయ నామం టెట్రాడాన్ ఇది ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపగా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. జపాన్‌కు చెందిన ‘ఫుగు’ లేదా ‘బ్లో ఫిష్’. జపాన్‌లోని షిమోనోసెకి అనే ప్రాంతంలో దీన్ని ఎక్కువగా వండుకుని తింటారు. జపాన్, కొరియాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లు ఈ చేపలతో టేస్టీ ఆహారం సిద్ధం చేస్తారు. ఈ చేపను వండాలంటే సుమారుగా పదేళ్ల అనుభవం, లైసెన్స్ ఉన్న వాళ్లే చేయాలి. ఎందుకంటే ఈ చేప చాలా విషపూరితమైనది. కట్ చేసేటప్పుడు జాగ్రత్త పడకపోతే ఆ విషం వల్ల ప్రాణాలకే ప్రమాదకరం.
Comments
Please login to add a commentAdd a comment