మీనామృతం తదితర ద్రావణాలు, కషాయాల తయారీలో
దుర్గాడ ప్రకృతి వ్యవసాయదారుల విశేష కృషి
మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలలో కొన్ని కుళ్లి తినటానికి పనికి రాకుండాపోతుంటాయి. వాటిని మత్స్యకారులు పారేస్తుంటారు. అటువంటి పనికిరాని చేపలను ప్రకృతి వ్యవసాయదారులు పునర్వినియోగిస్తున్నారు. పంట చేలకు పోషకాలను అందించే చక్కని మీనామృతం తయారు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా గొల్ల్ర΄ోలు మండలం దుర్గాడకు చెందిన రైతు గుండ్ర శివ చక్రంతోపాటు పలువురు రైతులు మీనామృతం, అనేక రకాల కషాయలు, ద్రావణాల తయారీలో విశేష అనుభవం గడించారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తూ కషాయాలు, ద్రావణాలు స్వయంగా తయారు చేసుకోలేని స్థితిలో ఉన్న ఎందరో రైతులకు దువ్వాడ రైతాంగం చేదోడుగా ఉంటున్నది. గతంలో కుళ్లిన ఉల్లిపాయలతో ద్రావణం తయారు చేసి నల్ల తామర పురుగును నియంత్రించటంలో దుర్గాడ రైతులు విజయం సాధించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. అ రైతులు స్థానికంగా దొరికే పదార్థాలు, వనరులతో అనేక కషాయాలు, ద్రావణాలు తయారు చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తున్నారు. ఈ కోవలోదే మీనామృతం. తినటానికి, ఎండ బెట్టడానికి పనికిరాని పచ్చి చేపలను ముక్కలు చేసి పాత బెల్లం కలిపి, 90 రోజులు మురగబెట్టి మీనామృతం తయారు చేస్తున్నారు. ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. పంటల ఎదుగుదలకు.. పూత, పిందె రాలకుండా బలంగా పెరగడానికి దీన్ని పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఒక లీటరు సరి΄ోతుంది. మీనామృతం తయారు చేసి తమ పంటలపై వాడుకోవటంతో పాటు ఇతర ప్రాంతాల రైతులకు లీటరు రూ.120కి విక్రయిస్తున్నారు.
– ప్రసాద్, సాక్షి, పిఠాపురం
మీనామృతం బాగా పని చేస్తోంది!
పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.
– గుండ్ర శివచక్రం (95537 31023),
ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లా
పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ్ర΄ాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.
– గుండ్ర శివచక్రం (95537 31023),
ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం,
కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment