Corps
-
పనికిరాని చేపలతో పంటలకు పోషణ
మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలలో కొన్ని కుళ్లి తినటానికి పనికి రాకుండాపోతుంటాయి. వాటిని మత్స్యకారులు పారేస్తుంటారు. అటువంటి పనికిరాని చేపలను ప్రకృతి వ్యవసాయదారులు పునర్వినియోగిస్తున్నారు. పంట చేలకు పోషకాలను అందించే చక్కని మీనామృతం తయారు చేస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్ల్ర΄ోలు మండలం దుర్గాడకు చెందిన రైతు గుండ్ర శివ చక్రంతోపాటు పలువురు రైతులు మీనామృతం, అనేక రకాల కషాయలు, ద్రావణాల తయారీలో విశేష అనుభవం గడించారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేస్తూ కషాయాలు, ద్రావణాలు స్వయంగా తయారు చేసుకోలేని స్థితిలో ఉన్న ఎందరో రైతులకు దువ్వాడ రైతాంగం చేదోడుగా ఉంటున్నది. గతంలో కుళ్లిన ఉల్లిపాయలతో ద్రావణం తయారు చేసి నల్ల తామర పురుగును నియంత్రించటంలో దుర్గాడ రైతులు విజయం సాధించటం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది. అ రైతులు స్థానికంగా దొరికే పదార్థాలు, వనరులతో అనేక కషాయాలు, ద్రావణాలు తయారు చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తున్నారు. ఈ కోవలోదే మీనామృతం. తినటానికి, ఎండ బెట్టడానికి పనికిరాని పచ్చి చేపలను ముక్కలు చేసి పాత బెల్లం కలిపి, 90 రోజులు మురగబెట్టి మీనామృతం తయారు చేస్తున్నారు. ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. పంటల ఎదుగుదలకు.. పూత, పిందె రాలకుండా బలంగా పెరగడానికి దీన్ని పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి ఒక లీటరు సరి΄ోతుంది. మీనామృతం తయారు చేసి తమ పంటలపై వాడుకోవటంతో పాటు ఇతర ప్రాంతాల రైతులకు లీటరు రూ.120కి విక్రయిస్తున్నారు.– ప్రసాద్, సాక్షి, పిఠాపురంమీనామృతం బాగా పని చేస్తోంది!పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.– గుండ్ర శివచక్రం (95537 31023),ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లాపచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేస్తున్న మీనామృతం సేంద్రియ పంటలకు బాగా ఉపయోగ పడుతోంది. దీన్ని పిచికారీ చేసిన పంటల దిగుబడి పెరుగుతోంది. మా గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ ద్రావణం కోసం వివిధ ్ర΄ాంతాల నుంచి రైతులు వచ్చి తీసుకెళుతున్నారు. ప్రతీ రోజు సుమారు 100 లీటర్ల వరకు తయారు చేస్తున్నాం. దీంతోపాటు రసం పీల్చు పురుగు నివారణకు చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి ఎలియాజరు సహాయంతో వివిధ రకాల కొత్త కషాయాలు తయారు చేసి విక్రయిస్తున్నాం.– గుండ్ర శివచక్రం (95537 31023),ప్రకృతి వ్యవసాయదారుడు, దుర్గాడ, గొల్ల్ర΄ోలు మండలం, కాకినాడ జిల్లా -
అమాంతం పెరిగిపోయిన కౌలు ధరలు..
సొంతూళ్లో పంట భూములను కౌలుకు అప్పగించి చెట్టుకొకరు, పుట్టకొకరుగా పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగొచ్చారు. కరోనా మహమ్మారి విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి దొరక్క అంతా పల్లెబాట పట్టారు. ఇప్పుడు వారి దృష్టి సేద్యం వైపు మళ్లడంతో జిల్లాలో కౌలు భూములకు డిమాండ్ పెరిగింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కౌలు ధరలు ఇంతగా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికిస్తున్న ప్రోత్సాహం ఒక కారణమైతే.. కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం యథావిధిగా సాగుతుండటం మరో కారణంగా కనిపిస్తోంది. జె.పంగులూరు: జిల్లాలో సాగు భూములకు తీవ్ర డిమాండ్ నెలకొంది. కౌలు భూముల కోసం రైతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాదితో పోల్చితే ఎకరాకు కనీసం ఐదు వేల రూపాయల మేర పెరుగుదల కనిపిస్తోంది. భూముల వారీగా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, పంట ఉత్పత్తులకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం అధిక శాతం మందిని సాగుకు సమాయత్తం చేస్తోంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావహ దృక్పథానికి దారితీసింది. ఖరారవుతున్న ఒప్పందాలు.. కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నాచితకా వ్యాపారాలు కుంటుపడ్డాయి. నిన్నా మొన్నటి వరకు దూర ప్రాంతాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టు కొచ్చిన వారు స్వ గ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగ యువత పొలాల వైపు చూస్తోంది. గడచిన నాలుగు నెలలుగా మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. వ్యాపారాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో సొంత భూములున్న రైతులు కౌలుకు ఇవ్వడం మానేసి తామే సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది వరకు నీటి లభ్యత ఉండి వ్యవసాయ బోర్లు ఉన్న భూములకు ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు కౌలు లభించగా ఈ ఏడాది అవే భూములకు ఎకరానికి రూ. 30 నుంచి రూ.35వేల వరకు కౌలు చెల్లించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ భూ యజమానులకు కలిసి వస్తోంది. మిర్చి ధరలతో మరింత డిమాండ్.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావటం కౌలు ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. గత సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి. మిర్చి పంటకు నీరు సంవృద్ధిగా అందింది. ప్రస్తుతం ఎకరా మిర్చి పంట వేసేందుకు కౌలు రూ. 35 వేలు నుంచి 40 వేలు వరకు ఉంది. శనగ సాగు చేసే పొలాలకు ఎకరా కౌలు రూ. 25 నుంచి 30 వేలు పలుకుతోంది. ఈ కౌలు కూడా జూన్, జూలై మాసాలలో ముందుగానే కౌలు చెల్లించాలని భూ యజమానులు షరతు పెడుతున్నారు. శనగ పంటకు గిట్టుబాటు ధర.. ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం ఈ సంవత్సరం శనగ పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించింది. దీంతో రైతులు దళారులకు పంట అమ్మకుండా నేరుగా మార్కెట్ యార్డులకు అమ్ముకొని లభాలు బాట పట్టారు. సంవత్సరాల కొద్ది శీతల గిడ్డంగులలో వున్న శనగపంట ఈ సంవత్సరం మొత్తం అమ్ముడుపోయింది. దానితో ఈ సంవత్సరం శనగ పంట వేసేందుకు రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మాగాణికి రూ.30 వేలు.. ఈ సంవత్సరం జిల్లాలో మగాణి పంటలు కళకళలాడాయి. సకాలంలో వర్షాలు పడటం, సాగరు కాలువ నీరు సమృద్ధిగా అందటం, గిట్టుబాటు ధర వుండటంతో కౌలు ధరలు అమాంత పెరిగాయి. -
ప్రాణాలపైకొచ్చిన సరదా
కొత్తూరు: మండలంలోని పొన్నుటూరు పరిసరాల్లో గత 10 రోజులుగా ఏనుగుల గుంపు చెరుకు, అరటి తోటల్లో తిష్ఠవేశాయి. వీటిని చూసేందుకు సమీపంలో ఉన్న పలు గ్రామాలకు చెందిన ప్రజలు రోజూ వస్తున్నారు. అయితే రాయల పంచాయతీ పరిధి టింపటగూడ, అంజలిగూడకు చెందిన ఇద్దరు గిరిజనులు ఏనుగులను చూసేందుకు శనివారం రాత్రి వెళ్లినట్టు సమాచారం. ఈ సమయంలో చెరుకు తోటల్లో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా భయంకరంగా ఘీంకారం చేశాయి. ఈ అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఏనుగులను చూసేందుకు వెళ్లిన వారిపై దాడిచేశాయని అనుమానిస్తున్నారు. ఇంతలో ఏనుగులను చూసేందుకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువకుల్లో ఒకరు చెరుకు తోటల్లోనుంచి తిరిగి బయటకు వచ్చినట్టు తెలిసింది. మరో వ్యక్తి రాకపోవడంతో ఆ యువకుడిపై ఏనుగులు దాడిచేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఏనుగుల ఘీంకారాలను విన్న పొన్నుటూరు, బంకి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. వీరితో పాటు అప్పటికే అక్కడ కాపలా ఉన్న అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. టింపగూడకు చెందిన గిరిజనులు పొన్నుటూరు చేరుకున్నారు. ఎక్కువ మంది చేరడంతో గందరగోళం నెలకొంది. వీరిని అక్కడ నుంచి అటవీ సిబ్బంది పంపించారు. అయితే ఏనుగుల దాడిలో టింపగూడకు చెందిన యువకుడు మృతిచెంది ఉంటాడని సంఘటనా స్థలం వద్దకు చేరుకొన్నవారు అనుమానిస్తున్నారు. ఏనుగులు ఉన్న చోటకు వెళ్లేందుకు అటవీ సిబ్బంది, ప్రజలు భయపడుతున్నారు. ఆచూకీలేని యువకుడి ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఆ యువకుడి బంధువులు తెలిపారు. అటవీశాఖ రేంజర్ వివరాల సేకరణ ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి చెందాడన్న అనుమానాలు గుప్పుమనడంతో పాతపట్నం అటవీశాఖ రేంజర్ సోమశేఖర్ సంఘటనా స్థలానికి శనివారం రాత్రి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడా, లేదా అనేది ఇప్పుడు గుర్తించలేమని స్పష్టం చేశారు. రాత్రి కావడంతో చెరుకు తోటల్లో ఏనుగుల గుంపు ఉన్నందున చెరుకు తోటల్లోకి వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. తెల్లవారితే తప్ప ఏమి జరిగిందని చెప్పలేమని ఆయన తెలిపారు. ఆయనతోపాటు అటవీశాఖ అధికారి రామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు. -
పంటలు కాపాడేందుకు నీరందిస్తాం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ వీర్రాజు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేసిన పంట పొలాలకు పూర్తిగా నీరు అందిస్తామని ప్రాజెక్టు సీఈ వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన సాగర్ కుడికాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుపై నున్న కంట్రోల్ రూమ్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వేసిన 9.5 లక్షల ఎకరాల పంటపొలాలను కాపాడేందుకు ఒక తడి పూర్తిగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గుంటూరు బ్రాంచ్ కెనాల్స్ కింద వేసిన 2లక్షల ఎకరాలలో ఇప్పటికే లక్ష ఎకరాల భూమి తడిసిందని మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు చెప్పారు. జూలకల్లు బ్రాంచ్ కెనాల్ నుంచి తంగిడ, ఆకురాజుపల్లిలోని మిరప పంటలకు మరో తడి నీరు ఇస్తే పంట రైతు చేతికి అంది వస్తుందన్నారు. సాగర్ జలాశయంలో నీరు తక్కువుగా ఉందని దీనిని దష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటలను వేయవద్దని సూచించారు. రైతులను రబీ పంటలను వేస్తే పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కుడికాలువపై అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల కనెక్షన్లు తొలగించేందుకు నీటిసంఘాలు పోలీసుల సహకారంతో ప్రత్యేక బందాలను ఏర్పాటు చే యాలని కోరారు. చివరి ఆయకట్టు భూముల వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం సాగు, తాగు నీటికి విడుదల చేస్తున్న 10 టీఎంసీలలో ఇప్పటికే 7.5 టీఎంసీలు విడుదల చేశామని వివరించారు. మరో మూడు రోజులలో నీటి విడుదల పూర్తవుతుందన్నారు. మరో 3 టీఎంసీల నీటి అవసరం ఉందనే విషయాన్ని ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట కుడికాలువ డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరావు, జేఈలు లక్ష్మీనారాయణ, కేశవరావు, సత్యనారాయణ ఉన్నారు. -
వర్షాభావం వెంటాడుతోంది
నారుపోసి 30 రోజులైనా పూర్తవని ఉభాలు ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకం పంట కోసం రూ.లక్షల పెట్టుబడి అన్నదాతల ఆందోళన సీతానగరం: వర్షాభావం వెంటాడుతోంది. పొలాల్లో తడారిపోతోంది. ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్ధకమవుతోంది. రైతాంగానికి వేదన మిగులుతోంది. వరినారు వేసిన సమయంలో వర్షాలు కురవడంతో అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి నారు పోసారు. నారుపోసి 30 రోజులు గడుస్తున్నా ఉభాలకు నీటి సౌకర్యం కల్పించక, వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో వర్షాధారంగా వరి పండించే గాదెలవలస, జానుమల్లువలస, ఏగోటివలస, దయానిధిపురం, పూను బుచ్చింపేట, కోటసీతారాంపురం, రంగంపేట, అనంతరాయుడుపేట తదితర గ్రామాల్లో రైతులు రూ.లక్షల పెట్టుబడితో దమ్ములు చేసి ఉభాలు పూర్తి చేశారు. వర్షాలు కురవక పోవడం, వరినాట్లు వేసిన భూములు నీరులేక ఆరిపోవడంతో చెరువులు, కాలువల్లోని సాగునీటిని ఆయిల్ ఇంజిన్లతో సరఫరా చేసి తడుపు కోవల్సి వచ్చింది. 500 ఎకరాల్లో పూర్తవని ఉభాలు సీతానగరం సాగునీటి ప్రాజెక్ట్ పరిధిలో 3,670 ఎకరాలకు సాగునీరందించాలని పాలక వర్గం నిర్ణయించగా 500 ఎకరాలకు సాగునీరందక ఉభాలు కాలేదు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో 1971 హెక్టార్లలో వరిపంట సాగవుతుండగా 1225 హెక్టార్లలో నాట్లు వేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయినా చెరువులకు నీరు సరఫరా చేసిన దాఖలాల్లేవు. దీంతో ఆగస్టు నెలలో పుష్కలంగా నీరుండాల్సిన చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. సీతానగరం ప్రాజెక్ట్ పరిధిలోని ఆర్.వెంకంపేట, కాశీపేట, పణుకుపేట గ్రామాలకు కాలువ నీరు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఉభాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఉభాలు కాని రైతులకు ఇన్పుట్ రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏడాదైనా ఇంతవరకూ అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు విడుదల చేస్తాం: తెంటు వెంకటప్పలనాయుడు, సీతానగరం ప్రాజెక్ట్ చైర్మన్ వర్షాలు తక్కువగా కురవడంతో ఎగువ గ్రామాల రైతులు ఉభాలు చేస్తున్నందున దిగువ భూములకు నీరందించడం ఆలస్యమైంది. రెండు రోజుల్లో దిగువ గ్రామాల భూముల్లో ఉభాలకు అవసరమైన నీరు విడుదల చేస్తాం. వథాగా వీఆర్ఎస్ మిగులు జలాలు: వై.సింహాచలం, రైతు, జానుమల్లువలస వీఆర్ఎస్ మిగులు జలాలు వథాగా పోతున్నాయి. కాలువలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి వర్షాధార భూములకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలి.