
మాంసాహారులు ఇష్టంగా తినే సాల్మన్ చేపలు సౌందర్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొటిమలు సమస్య నుంచి ముడతల వరకు ప్రతి చర్మ సమస్యలో సమర్థవంతంగా పోరాడటంలో తోడ్పడుతుందని తెలిపారు నిపుణులు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.
ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబతున్నారు నిపుణులు.
ఇది చర్మానికి కావాల్సిన ఆర్థ్రీకరణ పెంచడంలోనూ, ముడతలతో పోరాడటంలోనూ సహాయపడుతుందట.
ఈ సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇవి చర్మం తోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైనవి.
ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు తేమ అవరోధాన్ని నిర్వహించడమేగాక చర్మం బొద్దుగా, మృదువుగా ఉండేలా చేస్తాయి.
ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల వాటిల్లే నష్టం నుంచి రక్షిస్తాయి.
దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు చర్మాన్ని డ్రై కానివ్వవు. తేమను లాక్ చేసి రోజంతా తాజాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాయి.
మొటిమలను నియంత్రిస్తాయి.
అలాగే మొటిమలు వల్ల ఎదురయ్యే మంటను కూడా నివారిస్తాయి.
కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉండేలా చేయడంలో కొల్లాజెన్ కీలకం.
సాల్మన్‌లోని అధిక స్థాయి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
అలాగే ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను తగ్గిస్తాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
ఇందులోని విటమిన్ డీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పైగా ముఖ వర్చస్సు పెరుగుతుంది కూడా.
అంతేగాదు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది.
మచ్చలు వంటి వాటిని నివారించి స్కిన్ హీలింగ్‌కు మద్దుతిస్తుంది.
(చదవండి: చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?)
Comments
Please login to add a commentAdd a comment