Salmon
-
సాల్మన్ చేపలతో సౌందర్యం..!
మాంసాహారులు ఇష్టంగా తినే సాల్మన్ చేపలు సౌందర్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొటిమలు సమస్య నుంచి ముడతల వరకు ప్రతి చర్మ సమస్యలో సమర్థవంతంగా పోరాడటంలో తోడ్పడుతుందని తెలిపారు నిపుణులు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబతున్నారు నిపుణులు. ఇది చర్మానికి కావాల్సిన ఆర్థ్రీకరణ పెంచడంలోనూ, ముడతలతో పోరాడటంలోనూ సహాయపడుతుందట. ఈ సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇవి చర్మం తోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు తేమ అవరోధాన్ని నిర్వహించడమేగాక చర్మం బొద్దుగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల వాటిల్లే నష్టం నుంచి రక్షిస్తాయి. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని డ్రై కానివ్వవు. తేమను లాక్ చేసి రోజంతా తాజాగా హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాయి. మొటిమలను నియంత్రిస్తాయి. అలాగే మొటిమలు వల్ల ఎదురయ్యే మంటను కూడా నివారిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉండేలా చేయడంలో కొల్లాజెన్ కీలకం. సాల్మన్లోని అధిక స్థాయి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను తగ్గిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులోని విటమిన్ డీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పైగా ముఖ వర్చస్సు పెరుగుతుంది కూడా. అంతేగాదు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. మచ్చలు వంటి వాటిని నివారించి స్కిన్ హీలింగ్‌కు మద్దుతిస్తుంది.(చదవండి: చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?) -
ఇండియన్ సాల్మన్.. సాగు సక్సెస్..
సాక్షి, అమరావతి: ఇండియన్ సాల్మన్.. మన వాడుక భాషలో ‘మాగ’గా పిలిచే ఈ చేపలను దేశంలో తొలిసారి మన రాష్ట్రంలో సాగుచేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద కేజ్ కల్చర్‌లో చేపట్టిన ఈ చేపల సాగు విజయవంతమైంది. దీంతో చెరువుల్లో సాగుచేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సముద్రచేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో ఇదొకటి. జంతుశాస్త్రపరంగా సాల్మో సాలార్‌గా పిలిచే ఈ చేప మన దేశానికి చెందినది కాదు. పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లో పెరిగే ‘సాల్మో నిడ్స్’ సమూహానికి చెందినది. 5 నుంచి 10 అడుగుల లోతులో చల్లటి ఉప్పునీటి జలాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇవి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సముద్రపునీరు, మంచినీరు కలిసే చోటుకువచ్చి గుడ్లు పెట్టి పొదిగి తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి. ఇవి 10 కిలోల వరకు పెరుగుతాయి. పొడవుగా, నునుపాటి శరీరంతో ఉండే ఈ చేపకు పైభాగానే చిన్న నల్లటి చుక్కలుంటాయి. కింద భాగం (పొట్ట) తెల్లగా ఉంటుంది. మలేషియా, కువైట్లలో మాత్రమే వీటిని సాగుచేస్తున్నారు. ఈ చేపల తొలి హేచరి మలేషియాలో ఉంది. సముద్ర జలాల్లో సహజసిద్ధంగా దొరకడమే తప్ప.. వీటిసాగుపై ఇన్నాళ్లు దృష్టి పెట్టలేదు. పోషకాలు పుష్కలం.. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఈ చేపల్లో విటమిన్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, అయోడిన్‌కు కొదవలేదు. వారానికి కనీసం రెండుసార్లు తిన్నవారిలో గుండెపోటు, క్యాన్సర్, ట్యూమర్స్ దరిచేరవు. బీపీ తగ్గడమే కాదు.. ఎముకలు బలపడతాయి. నాడీవ్యవస్థ, మెదడు పనితీరు మెరుగుపడడమేగాక జ్ఞాపకశక్తి పెరుగుతుందని, వయసు సంబంధిత నష్టం తగ్గిస్తాయని అధ్యయనాల్లో రుజువైంది. మన దేశంలో మత్స్యకారులకు ఈ చేపలు అరుదుగా దొరుకుతాయి. మార్కెట్‌కు ‘మాగ’ చేప వస్తే చాలు.. ఎంత రేటైనా ఎగరేసుకుపోతారు. వెన్నుముల్లు మాత్రమే ఉండే ఈ చేపను వేపుడు చేసుకునేందుకు ఎక్కువమంది ఇష్టపడతారు. ఇగురు, పులుసు కూడా వండుకుంటారు. రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు ఈ చేపలసాగుపై దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడికి రెట్టింపు ఆదాయం దేశంలో తొలిసారి కృష్ణాజిల్లా నాగాయలంక వద్ద సముద్ర జలాల్లో ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ విధానంలో వీటిసాగు చేపట్టారు. కేజ్ కల్చర్‌లో విజయవంతం కావడంతో చెరువుల్లో సాగుపై దృష్టిసారించారు. కేజ్‌ల్లో అరకిలోకు మించి పెరగవు. అదే నాలుగడుగుల లోతున్న చెరువుల్లో 8–12 నెలలు పెంచితే కిలో నుంచి రెండుకిలోల వరకు పెరుగుతాయి. సీ మౌత్‌లో దొరికే సీడ్‌ను నర్సరీ చెరువులో మూడంగుళాల సైజు వరకు పెంచి తర్వాత ఎకరా చెరువులో రెండువేల పిల్లల వరకు వేయవచ్చు. 45 శాతం ప్రొటీన్లు, 12 శాతం కొవ్వు పదార్థాలు కలిగిన మేత వేస్తే చాలు. వ్యాధి నిరోధకశక్తి అధికం కాబట్టి వ్యాధులకు కూడా దూరంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.450కి పైగా పలుకుతోంది. కిలోకి రూ.225 వరకు పెట్టుబడి అవుతుంది. రెట్టింపు ఆదాయం వస్తుంది. ఈ చేపల సాగుపై లోతైన అధ్యయనం చేసి రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తొమ్మిదేళ్లు శోధించా కొన్నేళ్లుగా కేజ్‌కల్చర్‌లో పండుగప్ప సాగుచేస్తున్నా. ఇండియన్ సాల్మన్ సాగుచేయాలని తొమ్మిదేళ్ల నుంచి ఎంతో లోతుగా అధ్యయనం చేసి ఇటీవలే ప్రయోగాత్మకంగా చేపట్టా. సీ మౌత్‌లో పిల్లలను సేకరించి వేశా. పోషక విలువలున్న మేత అందిస్తున్నా. నాలుగు నెలల్లో పావుకిలో సైజు పెరిగాయి. మరో మూడునెలలు పెంచితే ముప్పావు కిలోవరకు వస్తాయి. రూ.లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుంది. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నా. చెరువుల్లో సాగుకు ఎంతో అనుకూలమైన ఈ చేపల సాగుపై రైతులు దృష్టిసారిస్తే మంచిది. – తలశిల రఘుశేఖర్, నాగాయలంక, కృష్ణాజిల్లా -
'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ
టైటిల్ : వైల్డ్‌డాగ్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితురులు నిర్మాణ సంస్థ : మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ట్స్ నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి దర్శకత్వం : అహిషోర్ సాల్మన్ సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : షానిల్ డియో విడుదల తేది : ఏప్రిల్ 02,2021 వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్ నాగార్జున. అందం, ఫిట్‌నెస్‌లో యువ హీరోలకు ధీటుగా కనిపిస్తుంటాడీ స్టార్ హీరో. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న నాగ్.. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న కథా చిత్రాలను చేశాడు. జయాపజయాలను లెక్క చేయకుండా తన పంథాలో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న ఈ అక్కినేని హీరో.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై నాగ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎన్నో అశలు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్ 02)విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్ ట్రాక్ ఎక్కించిందా? కింగ్ నాగార్జున చేసిన మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ విజయాన్ని అందుకున్నాడా? రివ్యూలో చూద్దాం. కథ విజయ్ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమమని భావిస్తాడు. అందుకే డిపార్ట్మెంట్లో ఆయన్ను అంతా ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. అలా అనేకమంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసి సస్పెండ్ అవుతాడు విజయ్ వర్మ. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్ బేకరిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్ (అతుల్ కులకర్ణి).. సస్పెండ్ అయిన ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మను తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టేకప్ చేస్తాడు. తన టీమ్‌తో కలిసి విజయ్‌వర్మ బాంబు బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్ చేశాడని కనిపెడతారు. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ను మళ్లీ సస్పెండ్ చేస్తారు. అసలు విజయ్‌ని ఎన్ఐఏ అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ అయినప్పటికీ తన టీమ్‌తో కలిసి ఖాలిత్‌ను ఎలా పట్టుకున్నాడు? విజయ్ లీడ్ చేస్తున్న ఎన్ఐఏ టీమ్‌లో ‘రా’ ఏజెంట్ అయిన ఆర్యా పండిట్ (సయామీ ఖేర్)ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? చివరకు ఖాలిత్‌ను విజయ్ వర్మ ఏం చేశాడు అనేదే మిగతా కథ. నటీనటులు ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కింగ్ నాగార్జున. ‘వైల్డ్‌డాగ్’ మూవీ కూడా ఓ ప్రయోగమనే చెప్పాలి. దేశభక్తి గల ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగ్. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్లో అదరగొట్టాడు. రా ఏజెంట్ ఆర్యాపండిత్ పాత్రలో సయామీ ఖేర్ జీవించేసింది. చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. విజయ్ వర్మ టీమ్ సభ్యుడిగా బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్ వర్మ భార్య ప్రియగా దియా మీర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది. అతుల్ కులకర్ణి, ప్రకాశ్, ప్రదీప్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ఓ సీరియస్ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ సినిమా నడించాడు. ఫస్టాప్ ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నాగార్జున నటన తమన్ నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ కమర్షియల్ అంశాలు లేకపోవడం ఫస్టాఫ్ -అంజి శెట్టె -
ఇలా ఉండాలట!
కొలత అందగాడంటే ఇలాగే ఉండాలట! అందగత్తె అంటే ఈవిడేనట! అయితే వీళ్లిద్దరూ నిజమైన వ్యక్తులు కారు. ఈ-ఫిట్ సాఫ్ట్‌వేర్‌తో ఊపిరి పోసుకున్న ఊహా చిత్రాలు. ఫేసియల్ మ్యాపింగ్‌లో నిపుణుడైన డాక్టర్ క్రిస్ సాల్మన్, అయన బృందం కలిసి, బ్రిటన్‌లోని 300 మంది పౌరుల అభిరుచులను సేకరించి ఆడామగల అందానికి కొలమానాలను నిర్ణయించారు. వాటి ప్రకారం తయారైన ముఖారవిందాలే ఇవి. ప్రధానంగా ముక్కు పొడవు, వెడల్పు, పెదవుల మందం, తల వెంట్రుకల తీరు, దవడల ఆకృతి ఎలా ఉంటే అందంగా కనిపిస్తారు అనే అంశాలపై సాల్మన్ బృందం అభిప్రాయాలను సేకరించి స్త్రీ, పురుషుల అందానికొక కొత్త నిర్వచన రూపం ఇచ్చింది. అయితే ఈ కొలమానం బ్రిటన్‌కు మాత్రమే పరిమితం అనీ, ఆసియా దేశాలవారి రూపలావణ్యాల కొలబద్దలు అక్కడివారి టేస్ట్‌ను బట్టి ఉంటాయని సాల్మన్ అంటున్నారు.