
భద్రాద్రి: ఓ మహిళకు చేప చిక్కగా.. ఇంకో చేప కనిపించడంతో మొదటి చేపను నోటితో పట్టుకుని రెండో దాని కోసం యత్నిస్తుండగా గొంతులోకి వెళ్లడంతో ప్రాణాపాయ స్థితి ఎదురైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన మహిళ సీత భద్రాచలంలో పట్టణంలోని గోదావరిలో చేపలు పట్టి అమ్ముతూ జీవనం సాగిస్తోంది.
మంగళవారం ఆమె ఒక చేపను నోటితో పట్టుకుని, మరో చేపను పట్టే క్రమంలో నోట్లో పెట్టుకున్న చేప గొంతులోకి జారి అడ్డంగా ఇరుక్కుపోయింది. దీంతో ఓ పక్క ముఖం వాపు వచ్చి ఇబ్బంది పడుతుండగా బంధువులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈఎన్‌టీ వైద్యుడు ప్రవీణ్ ఆమె గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. సరైన సమయానికి సీతను ఆస్పత్రికి తీసుకుని రావడంతో ప్రమాదం తప్పినట్లయిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment