జబర్దస్త్ కమెడియన్‌గా ఫేమ్ తెచ్చుకున్న ఆర్పీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాదు.. గతేడాది ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. విశాఖపట్నంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు.
కానీ పెళ్లికి ముందే హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి. స్టాల్స్ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నా బిజినెస్ నా ఇష్టం.. నా రేట్లు అంతే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి.
ఆర్పీ మాట్లాడుతూ..'ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. ఆడి, బెంజ్, క్రెటా కార్లలో నీ స్తోమతను బట్టి తీసుకుంటాం. ఇది కూడా అంతే కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే తీసుకుంటారు. అంతే తక్కువ రేటు అని చెప్పి.. ఎలా పడితే అలా ఇవ్వలేను కదా. మేం మొత్తం క్వాలిటీ ఉత్పత్తులు మాత్రమే వాడుతాం. నా చేపల పులుసు నీకు అందుబాటు రేటులో ఉంటేనే తిను. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నాపై అలాంటి ప్రచారం చేస్తుంటారు. నీకు ఇష్టముంటే తిను. లేకపోతే పో. నా చేపల పులుసు రేట్లు అంతే. అంతేకానీ రూ.100 జేబులో పెట్టుకుని.. రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నాది కూడా వ్యవసాయం కుటుంబమే. ఎవరెన్ని చేసిన ఐ డోంట్ కేర్. నా చేపల పులుసుపై నాకు నమ్మకముంది' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment