rp
-
ఆ విషయం నాకు కూడా తెలుసు... మీకు ఇష్టముంటేనే రండి: ఆర్పీ హాట్ కామెంట్స్
జబర్దస్త్ కమెడియన్‌గా ఫేమ్ తెచ్చుకున్న ఆర్పీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాదు.. గతేడాది ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. విశాఖపట్నంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లికి ముందే హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లి, అమీర్‌పేట్‌లోనూ అతనికి బ్రాంచ్‌లున్నాయి. స్టాల్స్ ప్రారంభం నుంచే ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీ తన బిజినెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ వద్ద ధరలు అధికంగా ఉన్నాయంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆర్పీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నా బిజినెస్ నా ఇష్టం.. నా రేట్లు అంతే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి. ఆర్పీ మాట్లాడుతూ..'ఇది నా బిజినెస్. నా రేట్లు ఇంతే. చేపలకు, మిగతా వాటికి చాలా తేడా ఉంటుంది. ఆడి, బెంజ్, క్రెటా కార్లలో నీ స్తోమతను బట్టి తీసుకుంటాం. ఇది కూడా అంతే కొనగలిగే కెపాసిటీ ఉన్నవాళ్లే తీసుకుంటారు. అంతే తక్కువ రేటు అని చెప్పి.. ఎలా పడితే అలా ఇవ్వలేను కదా. మేం మొత్తం క్వాలిటీ ఉత్పత్తులు మాత్రమే వాడుతాం. నా చేపల పులుసు నీకు అందుబాటు రేటులో ఉంటేనే తిను. లేకపోతే వద్దు. కొందరు కావాలనే నాపై అలాంటి ప్రచారం చేస్తుంటారు. నీకు ఇష్టముంటే తిను. లేకపోతే పో. నా చేపల పులుసు రేట్లు అంతే. అంతేకానీ రూ.100 జేబులో పెట్టుకుని.. రూ.1000 ఫుడ్ కావాలంటే వస్తుందా? మా చేపల పులుసు తినమని నేను ఎవరినీ బతిమాలాడను కదా? రేట్లు ఎంత పెట్టాలి అనే విషయం నాకు తెలుసు. నాది కూడా వ్యవసాయం కుటుంబమే. ఎవరెన్ని చేసిన ఐ డోంట్ కేర్. నా చేపల పులుసుపై నాకు నమ్మకముంది' అని అన్నారు. -
సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న కిర్రాక్ ఆర్పీ, వైరల్ అవుతున్న (ఫొటోలు)
-
ప్రేయసితో 'జబర్దస్త్' కిర్రాక్ ఆర్పీ నిశ్చితార్థం (ఫోటోలు)
-
కమెడియన్ ఆర్పీ లగ్జరీ ఇల్లు చూస్తే షాకవ్వాల్సిందే! లిఫ్ట్, హోమ్ థియేటర్..
బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలతో బాగా పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. తనదైన యాసతో, డిఫరెంట్ కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే ఆర్పీ తాజాగా యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. ఇందులో మొట్టమొదటగా హోమ్ టూర్ వీడియో చేశాడు. ఇటీవలే హోమ్ టూర్ వీడియో ప్రోమో వదిలిన ఆర్పీ లేటెస్ట్గా తన ఇంటినంతా చూపిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఆర్పీ ఇల్లు ఎంతో విశాలవంతంగా లగ్జరీగా ఉంది. హాల్లో అడుగుపెట్టగానే సేద తీరేందుకు వీలుగా ఒక మంచి సోఫా సెట్టు, పెద్ద టీవీ ఉన్నాయి. అలాగే తన ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన బహుమతులన్నీ కూడా హాల్లోనే ఉన్నాయి. ఓ పక్కన అక్వేరియంతో పాటు మనీ ప్లాంట్ కూడా ఉంది. కిచెన్‌కు అనుసంధానంగా డైనింగ్ టేబుల్ ఉంది. తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటినంతటిని ఇంటీరియర్ డిజైన్ చేయించాడు ఆర్పీ. హాల్లోనే మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించాడు. అంతేకాకుండా పై రెండు అంతస్థులను చేరుకోవడానికి మెట్ల సౌకర్యంతో పాటు లిఫ్ట్ కూడా ఉంది. కింది హాల్లోనే పెరేంట్స్ బెడ్ రూమ్ ఉండగా దాన్ని ప్రేక్షకులకు చూపించాడు. ఫస్ట్ ఫ్లోర్లో స్టడీ హాల్, అన్నయ్య బెడ్రూమ్, తన మాస్టర్ బెడ్రూమ్లను చూపించాడు. ఈ గదులను తాను దగ్గరుండి ఆలోచనలకు తగ్గట్టుగా డిజైన్ చేయించుకున్నానని తెలిపాడు. ఇక తన బెడ్రూమ్లోని ఫొటోలను చూపిస్తూ మెలికలు తిరిగిన ఆర్పీ ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టాడు. బెడ్రూమ్లో పెట్టుకున్న ఓ అమ్మాయి ఫొటోను చూపిస్తూ ఆవిడ తనకు కాబోయే భార్య అని చెప్పాడు. వచ్చే నెలలోనే ఎంగేజ్మెంట్ ఉందని తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు. అనంతరం రెండో ఫ్లోర్‌లోని హోమ్ థియేటర్‌ను చూపించాడు. లాక్డౌన్లో ఎక్కువ సమయం తన ఫ్యామిలీ అంతా ఈ హోమ్ థియేటర్ దగ్గరే గడిపామని చెప్పాడు. అనంతరం టెర్రస్ మీద తాను పెంచుతున్న రకరకాల మొక్కలను చూపించాడు. పెంచుకున్న మొక్కల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటే ఆ హాయే వేరని చెప్పుకొచ్చాడు ఆర్పీ. ఈ హోమ్ టూర్ వీడియో చూసిన నెటిజన్లు ఇల్లు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. చదవండి: ఒంటిపై బట్టల్లేకుండా ఫొటోలు.. కాంప్రమైజ్ కావాలనేవారు ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్ -
‘ఆర్ పీలకు రూ.10వేలు గౌరవవేతనం’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటతప్పని నాయకుడని మంగళవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ఉడా కాలనీ 58వ డివిజన్లో భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో పేద ప్రజలకు నేనున్నాను మీకు అంటూ సీఎం జగన్ అభయం ఇచ్చారని గుర్తుచేశారు. మహిళలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని తెలిపారు. ఆర్ పీలకు రూ. 10వేలు గౌరవవేతనం జీవోను అమలు చేయడంపై ఉద్యోగస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా సీఎం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. నగరంలో 434 మంది ఆర్ పీలు భారీ ఎత్తున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటాన్ని పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్.పీలు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆర్పీలు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఆర్ పీలకు గౌరవ వేతనం అందించలేదని ఆర్ పీలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి రూ. 10వేలు జీవోను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఆర్ పీలు అందరూ రుణపడి ఉంటారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆర్పీలు పేర్కొన్నారు. -
టాలెంట్ ఉన్నోళ్లు కనిపించట్లేదు: జబర్దస్త్ ఆర్పీ
చిల్లకూరు: ‘జబర్దస్త్’తో నవ్వులు పూయిస్తూ వెండితెరపైనా సత్తాచాటుకుంటున్న వర్ధమాన నటుడు రాటకొండ ప్రసాద్ అలియాస్ ఆర్పీ. ఆయన సొంతూరు నెల్లూరు జిల్లా ఓజిలి మండలం సగటూరు. షూటింగ్ లేని సమయంలో తన వారిని కలుసుకునే ఆర్పీ.. చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూడు. అలా శుక్రవారం తన స్నేహితులతో కలిసి చిల్లకూరు వచ్చిన ఆర్పీని ‘సాక్షి’ పలుకరింగా మనస్సులోని మాటలను పంచుకున్నాడు.. ఎంత వరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు చదువుకున్నా. ప్రాథమిక విద్య సగటూరు, చిలమానుచేను, ఇంటర్ నాయుడుపేట చదలవాడ జూనియర్‌కళాశాల, డిగ్రీ గూడూరులోని స్వర్ణాంధ్ర భారతిలో చదివా. జబర్దస్త్‌లోకి రాక ముందు ఏమి చేసేవారు? చదవు పూర్తి చేసిన తరువాత హైదరాబాద్ వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. సాధ్యం, గురుడు, గేమ్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గాపనిచేశా. జబర్దస్త్‌లో ప్రవేశం ఎప్పడు? 2014 నవంబరులో జబర్దస్త్‌లో ప్రవేశించా.ఇప్పటి వరకు 270 స్కిట్లు చేసా. సినిమాలపై దృష్టి సారించారా? గుర్తింపు తెచ్చే పాత్ర కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటకే పది సినిమాల్లో నటించా. ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్నా. పెద్ద డైరెక్టర్ కావాలన్నదే తన లక్ష్యం. కొత్త వారికి ప్రోత్సాహం ఎంతవరకు ఉంటుంది? కొత్త వారిని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ సిద్ధమే. మంచి టాలెంట్ ఉన్న వారు కనిపించడంలేదు. ఇటీవల మహేష్ కనిపించాడు. అతనిలోని టాలెంట్‌ను గుర్తించి అవకాశాలు ఇస్తున్నాం. ఏమైనా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారా? గూడూరులో జూన్ మొదటి వారంలో ఒక కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నా. తద్వారా వచ్చే నగదుతో పేదలకు సాయం అందించేందుకు చేయూత ఫౌండేషన్‌ను ప్రారంభిస్తున్నా. చివరగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? త్వరలోనే చేసుకుంటా. అమ్మాయి కోసం వెతుకుతున్నా కనబడగానే చేసుకుంటా(నవ్వూతూ) -
ఆర్పీ బయోలో కేళీలు వాస్తవమే
తొర్రేడు (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాలో ఆర్పీ బయో 226 వరి రకం సాగుచేసిన పొలాల్లో కేళీలు వచ్చిన మాట వాస్తవమేనని మార్టేరు వ్యవసాయ పరిశోధనాకేంద్రం అసోసియేట్ డీన్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ద్వారా జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ విత్తనాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో కేళీలు ఎక్కువగా ఉన్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో మార్టేరు పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు, ఏరువాక శాస్త్రవేత్తలు, ఏపీ సీడ్స్ బృందం బుధవారం తొర్రేడులోని వరి పొలాలను పరిశీలించారు. పరిశోధనాకేంద్రం అసోసియేట్ డీన్ సత్యనారాయణ మాట్లాడుతూ బీపీటీ 5204కు ప్రత్యామ్నాయంగా ఆర్పీబయో రకం సరఫరా చేశారన్నారు. కేళీలు రావడం వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఏరువాక శాస్త్రవేత్తలు ప్రవీణ, నందకిషోర్, మార్టేరు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మల్లికార్జునరావు, చాముండేశ్వరి, కృష్ణంరాజు, రాజమహేంద్రవరం వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఎఫ్ఏసీ) కె.సూర్యరమేష్, వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.