Comedian Kiraak RP Luxury Home Tour Video - Sakshi
Sakshi News home page

Kiraak RP Home Tour: కిరాక్‌ ఆర్‌పీ ఇల్లు చూశారా? లిఫ్ట్‌, హోమ్‌ థియేటర్‌.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి!

Apr 10 2022 3:23 PM | Updated on May 26 2022 8:51 AM

Comedian Kiraak RP Luxury Home Tour Video, Deets Inside - Sakshi

తను ప్రేమలో పడ్డానంటూ బెడ్‌రూమ్‌లో పెట్టుకున్న ఆ అమ్మాయి ఫొటోను సైతం చూపించాడు. వచ్చే నెలలోనే ఎంగేజ్‌మెంట్‌ ఉందని శుభవార్త చెప్పాడు. రెండో ఫ్లోర్‌లోని హోమ్‌ థియేటర్‌ను చూపించాడు.

బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలతో బాగా పాపులర్‌ అయ్యాడు కిరాక్‌ ఆర్‌పీ. తనదైన యాసతో, డిఫరెంట్‌ కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే ఆర్‌పీ తాజాగా యూట్యూబ్‌ చానల్‌ మొదలు పెట్టాడు. ఇందులో మొట్టమొదటగా హోమ్‌ టూర్‌ వీడియో చేశాడు. ఇటీవలే హోమ్‌ టూర్‌ వీడియో ప్రోమో వదిలిన ఆర్‌పీ లేటెస్ట్‌గా తన ఇంటినంతా చూపిస్తూ వీడియో రిలీజ్‌ చేశాడు. 

ఆర్‌పీ ఇల్లు ఎంతో విశాలవంతంగా లగ్జరీగా ఉంది. హాల్‌లో అడుగుపెట్టగానే సేద తీరేందుకు వీలుగా ఒక మంచి సోఫా సెట్టు, పెద్ద టీవీ ఉన్నాయి. అలాగే తన ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన బహుమతులన్నీ కూడా హాల్‌లోనే ఉన్నాయి. ఓ పక్కన అక్వేరియంతో పాటు మనీ ప్లాంట్‌ కూడా ఉంది. కిచెన్‌కు అనుసంధానంగా డైనింగ్‌ టేబుల్‌ ఉంది. తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటినంతటిని ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించాడు ఆర్‌పీ. హాల్‌లోనే మినీ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయించాడు. అంతేకాకుండా పై రెండు అంతస్థులను చేరుకోవడానికి మెట్ల సౌకర్యంతో పాటు లిఫ్ట్‌ కూడా ఉంది. కింది హాల్‌లోనే పెరేంట్స్‌ బెడ్‌ రూమ్‌ ఉండగా దాన్ని ప్రేక్షకులకు చూపించాడు.

ఫస్ట్‌ ఫ్లోర్‌లో స్టడీ హాల్‌, అన్నయ్య బెడ్‌రూమ్‌, తన మాస్టర్‌ బెడ్‌రూమ్‌లను చూపించాడు. ఈ గదులను తాను దగ్గరుండి ఆలోచనలకు తగ్గట్టుగా డిజైన్‌ చేయించుకున్నానని తెలిపాడు. ఇక తన బెడ్‌రూమ్‌లోని ఫొటోలను చూపిస్తూ మెలికలు తిరిగిన ఆర్‌పీ ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టాడు. బెడ్‌రూమ్‌లో పెట్టుకున్న ఓ అమ్మాయి ఫొటోను చూపిస్తూ ఆవిడ తనకు కాబోయే భార్య అని చెప్పాడు. వచ్చే నెలలోనే ఎంగేజ్‌మెంట్‌ ఉందని తన ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పాడు.

అనంతరం రెండో ఫ్లోర్‌లోని హోమ్‌ థియేటర్‌ను చూపించాడు. లాక్‌డౌన్‌లో ఎక్కువ సమయం తన ఫ్యామిలీ అంతా ఈ హోమ్‌ థియేటర్‌ దగ్గరే గడిపామని చెప్పాడు. అనంతరం టెర్రస్‌ మీద తాను పెంచుతున్న రకరకాల మొక్కలను చూపించాడు. పెంచుకున్న మొక్కల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటే ఆ హాయే వేరని చెప్పుకొచ్చాడు ఆర్‌పీ. ఈ హోమ్‌ టూర్‌ వీడియో చూసిన నెటిజన్లు ఇల్లు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు.

చదవండి: ఒంటిపై బట్టల్లేకుండా ఫొటోలు.. కాంప్రమైజ్‌ కావాలనేవారు

ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్‌ కూతురు ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement